AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ధరల పెరుగుదలపై చర్చించాలని సభలో టీడీపీ డిమాండ్ చేసింది. పేపర్లు చింపి విజిల్స్ వేస్తూ టీడీపీ సభ్యుల ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. విజిల్స్ ఊదుతూ సభ కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు.
Read Also: Perni Nani: చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లపై పేర్ని నాని ఫైర్
స్పీకర్ తమ్మినేని సీతారాం పైకి పేపర్లు చించి విసిరేశారు. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. ఒకరోజు పాటు… దీంతో టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులందరినీ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సభ నుంచి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ వచ్చి వారిని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.