Red Sandal Smugglers: రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగర్లు.. వాహనంతో ఢీకొట్టి కానిస్టేబుల్ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Red Sandal Smugglers: అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపారు. కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారుతో ఢీకొట్టడంతో ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి సమాచారం వచ్చింది. దీంతో సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద పోలీసు సిబ్బంది కాపు కాశారు. ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసుల తనిఖీలను గుర్తించి వేగంగా వారిని ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఎర్రచందనం వాహనాన్ని కానిస్టేబుల్ గణేశ్ ఆపేందుకు యత్నించాడు. తప్పించుకునే క్రమంలో ఎర్రచందన స్పగ్లర్లు అతడిని ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనలో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ గణేష్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన గణేష్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల్ని ఢీకొట్టి పారిపోతున్న స్మగ్లర్లను పోలీసులు వెంటపడి అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనంలో ఏడు ఎర్ర చందనం దుంగలను గుర్తించారు. వాహనంలో ఉన్న వారిలో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబరు ఉన్న వాహనంలో శేషాచలం అడవుల్లో చెట్లను నరికి దుంగలను తరిస్తున్నట్లు గుర్తించారు. కేవీపల్లి మండలం గుండ్రేవారిపల్లి క్రాస్ దగ్గర ఈ ఘటన జరిగింది.
Read Also: Purandeswari: ఏపీలో పవన్‌కళ్యాణ్‌తో బీజేపీకి పొత్తు ఉంది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో వేగంగా వాహనం నడిపి తప్పించుకోడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు విచారం వ్యక్తం చేశారు.
మృతి చెందిన కానిస్టేబుల్ మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 2013 బ్యాచ్ కానిస్టేబుల్ గణేష్, 14వ బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం గణేష్ డిప్యుటేషన్ పై యాంటీ స్మగ్లర్ టాస్క్ ఫోర్స్‌కు వచ్చాడని సహచరులు చెబుతున్నారు. కానిస్టేబుల్ మృతితో అతని కుటుంబసభ్యులు తీవ్రంగా విలపించారు. కానిస్టేబుల్ గణేష్‌కు భార్య అనూష, ఇద్దరు పిల్లలు రాజ్ కిశోర్ (6) వేదాన్ష్ (3) ఉన్నారు. కేవీ పల్లి మండలం గుండ్రేవారిపల్లి ఘటనా స్థలానికి అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు చేరుకుని పరిశీలించారు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!