టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు వరుస సినిమాలను నిర్మించడమే కాదు అనుకున్న టైం కు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడు.. ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ ల గేమ్ చేంజర్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఇంకా పలు సినిమాలు నిర్మిస్తున్నాడు.. వచ్చే నెలలో ఏకంగా రెండు సినిమాలను రిలీజ్ చేయబోతున్నాడు..
ఈ సినిమాల్లో ఒకటి ఆయన ఇంటి వారసుడు ఆశీష్ హీరోగా రూపొందుతున్న లవ్ మీ సినిమా కూడా ఉంది. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఆశీష్ హీరోగా రూపొందిన ఈ సినిమా టీజర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై ఆసక్తి కలిగించే విధంగా టీజర్ ఉంది. ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమాను రూపొందించినట్లుగా టీజర్ ను చూస్తే అర్థం అవుతుంది.. అరుణ్ డైరెక్షన్ దర్శత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి..
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 26 న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.. ఇదిలా ఉండగా అదే నెలలో దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ ను 5వ తారీకున విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఒకే నెలలో దిల్ రాజు బ్యానర్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఇలా ఒకే నెలలో ఒకే నిర్మాత నుంచి రెండు సినిమాలు రావడం అనేది ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా జరుగుతుంది… ఈ రెండు సినిమాలకు ఇప్పటికి వరకు భారీ అంచనాలు ఉన్నాయి.. ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.