టాలివుడ్ ముద్దుగుమ్మ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్లాప్ సినిమాలు ఒకవైపు పలకరిస్తున్నా కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక సోషక్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.. తాజాగా బాలీవుడ్ లో బంఫర్ ఆఫర్ కొట్టేసింది.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది..
ఈ అమ్మడు ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. టాలీవుడ్‌లో టాప్ స్టార్స్ తో కలిసి నటించింది. ప్రభాస్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, బన్నీ, రామ్‌చరణ్ వంటి వారితోనూ కలిసి నటించింది. యంగ్ హీరోలతోనూ జోడీ కట్టింది. వరుస అవకాశాలే కాదు, వరుస విజయాలతోనూ లక్కీ హీరోయిన్‌గా మారింది… గత కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే..ఈ ఏడాది వరుస సినిమాలను లైన్లో పెడుతుంది..
ప్రస్తుతం ఆమె బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సరసన ‘దేవా’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రోషన్ ఆండ్రూస్ ఈ యాక్షన్ థ్రిల్లర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే లేటెస్టుగా మరో హిందీ సినిమా ఆఫర్ పూజా చేతికి వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రముఖ హిందీ నటుడు సునీల్ శెట్టి వారసుడు అహన్ శెట్టి హీరోగా ‘సంకీ’ అనే సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ సాజిద్ నడియాడ్వాలా నిర్మించనున్న చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రేమికుల రోజున విడుదల చెయ్యడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు..