విశాఖపట్నం డ్రగ్ కంటైనర్ కేసు విచారణలో సీబీఐ అధికారులకి కొత్త డౌట్స్ వస్తున్నాయి. నాలుగు రోజుల విచారణలో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఆరు రకాల నిషేధిత సింథటిక్ డ్రగ్స్ అవశేషాలు గుర్తించారు.
లోకల్ గా ఇసుక కొరత ఉండొద్దన.. గ్రామాల్లో నిర్మాణాలు ఆగిపోవద్దని.. స్థానిక అవసరాలకు ఉచిత అనుమతి ఇస్తూ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ గ్రామాల నుంచి…
తాను చేరలేనంత దూరం కాదు… దొరకనంత దుర్గం కాదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని శనివారం వివిధ కులసంఘాల ప్రతినిధులు కలిశారు. అలాగే 317 జీవో బాధిత ఉద్యోగులు కూడా కలిశారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్‌కు చెందిన రెవెన్యూ ఉద్యోగి దయాకర్ కలిశారు. జీవో 317 వల్ల ఇబ్బందులను ముఖ్యమంత్రికి వివరించారు. ఎన్నికలు ముగియగానే జీవో…
పది సంవత్సరాలు పాలించిన బీఆర్‌ఎస్‌కు స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరమని బీజేపీ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మర్కుక్ మండల కేంద్రంలోని రంగనాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీకి మెదక్‌లో ఒక్క స్థానిక అభ్యర్థి దొరకకపోవడం విడ్డూరమన్నారు. అలా అయితే బీఆర్ఎస్ పార్టీ దుకాణాన్ని బంద్ చేసుకోవాలని ఎద్దేవా చేశారు. మెదక్ సీటును ఆ పార్టీ ఇతర ప్రాంతాల వారికి అమ్ముకున్నదని ఆరోపించారు.…
కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు త్యాగాల పార్టీ అని అన్నారు మంత్రి సీతక్క. ప్రజల కోసమే పనిచేసే పార్టీ కాంగ్రెస్ అని ఆమె అన్నారు. ఇవాళ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే అని ఆమె వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు వ్యక్తుల పార్టీలు స్వార్థపూరిత పార్టీలు అని ఆయన అన్నారు. ఓట్ల చీలిక కోసం కొత్త నాటకాలు…
న్యాచురల్ స్టార్ నాని సినిమాల లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ఇటీవల హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు మరో యాక్షన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.. ‘సరిపోదా శనివారం’ అనే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చేస్తున్నాడు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్,టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. దసరా…
కేసీఆర్ బ్లాక్ డే గా ప్రకటించడం గురువింద గింజను గుర్తు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయించారని, ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ మాజీ సీఎం కూతురు ఎమ్మెల్సీ కవిత పేరుతో డొంక బయట పడిందన్నారు. కవిత ను దృష్టిలో పెట్టుకొని లిక్కర్ అవినీతి పై విచారణ జరగలేదని, ఢిల్లీ అధికారుల పిర్యాదు మేరకు దర్యాప్తు జరుగిందన్నారు. ఢిల్లీ మద్యం…
జమ్మూకశ్మీర్లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ ఇవాళ(మార్చి 23) పర్యాటకుల కోసం తెరుచుకుంది. ఈసారి 17 లక్షల తులిప్ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్ అధికారులు తెలిపారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించగా.. పొరుగున ఉన్న సుక్మా జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని పోలీసు అధికారి శనివారం తెలిపారు.
వికారాబాద్ జిల్లా పరిగి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞనేశ్వర్, ఎమ్మెల్సీ సురభి వాణి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ హాజరయ్యారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..…