Asia’s Largest Tulip Garden: తెరుచుకున్న తులిప్ గార్డెన్.. 17 లక్షల పూలతో కనువిందు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia’s Largest Tulip Garden: జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ ఇవాళ(మార్చి 23) పర్యాటకుల కోసం తెరుచుకుంది. ఈసారి 17 లక్షల తులిప్ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్ అధికారులు తెలిపారు. దాల్ సరస్సు, జబర్వాన్ హిల్స్ మధ్య ఉన్న ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్‌ను శనివారం పర్యాటకుల సందర్శన కోసం తెరిచినట్లు అధికారులు తెలిపారు. మార్చి 19న ప్రారంభమైన తులిప్ ఫెస్టివల్ 20 రోజుల పాటు జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ తులిప్ గార్డెన్ ప్రకృతి ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనుంది. గతంలో సిరాజ్ బాగ్ అని పిలిచే ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్‌లో వివిధ రంగుల తులిప్‌లు పూయడం ప్రారంభించినందున ప్రజల కోసం తెరవబడిందని ఫ్లోరికల్చర్ శాఖ అధికారులు తెలిపారు. “తులిప్ గార్డెన్‌ను పర్యాటకుల కోసం తెరిచారు” అని ఆ శాఖ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్ వెల్లడించారు.
Read Also: Rekha Jhunjhunwala: సముద్ర వ్యూ చెడిపోతుందని.. రూ.118 కోట్లతో బిల్డింగ్ మొత్తాన్ని..
Also Read
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
తులిప్ గార్డెన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉద్యానవనమని, కశ్మీర్ లోయలో పర్యాటక రంగానికి ఇది ఊతమిస్తున్నదని అధికారులు అన్నారు. ఈసారి జరిగే తులిప్ ఫెస్టివల్‌లో ఐదు కొత్త రకాల పూలను పరిచయం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 17 లక్షల తులిప్ పూలను చూడవచ్చన్నారు. కాగా ఈ గార్డెన్‌ను సిద్ధం చేయడానికి దాదాపు ఆరు నెలలు పడుతుందని, ఇందుకోసం విస్తృతమైన ప్రణాళిక ఉంటుందన్నారు. ఈ ఏడాది పర్యాటకుల సంఖ్యపై మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని గార్డెన్ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న 68 రకాల తులిప్‌లకు ఈ ఏడాది ఐదు కొత్త రకాల తులిప్‌లను చేర్చినట్లు ఫ్లోరికల్చర్ శాఖ తెలిపింది. మరో రెండు లక్షల తులిప్ మొక్కలను జోడించి తులిప్ గార్డెన్ విస్తీర్ణాన్ని కూడా పెంచింది. 55 హెక్టార్లలో విస్తరించి ఉన్న తోటలో రికార్డు స్థాయిలో 17 లక్షల తులిప్ మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. తోటలో వివిధ రకాల పువ్వులు, రంగులను జోడించడానికి హైసింత్స్, డాఫోడిల్స్, మస్కారి, సైక్లామెన్స్ వంటి ఇతర స్ప్రింగ్ పువ్వులు కూడా ప్రదర్శనలో ఉంటాయని వారు తెలిపారు.
Read Also: Neha Sharma: చిరుత నటి పొలిటికల్ ఎంట్రీ.. లోక్‌సభ ఎన్నికల బరిలో నేహా!
ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్‌ను జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకాన్ని ముందుకు తీసుకెళ్లడానికి 2007లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేశారు. నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకున్న 50,000 తులిప్ మొక్కలతో గార్డెన్ చిన్న స్థాయిలో ప్రారంభమైంది. అనంతరం తక్షణమే జనాదరణ పొందింది. ప్రతి సంవత్సరం సందర్శకుల సంఖ్యతో పాటు తులిప్ రకాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత ఏడాది స్వదేశీ, విదేశీయులైన 3.65 లక్షల మంది సందర్శకులు గార్డెన్‌ను సందర్శించగా, 2022లో 3.60 లక్షల మంది ప్రజలు వచ్చారు.తులిప్ గార్డెన్ చలనచిత్రాలు, వీడియోలను చిత్రీకరించడానికి ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి. సందర్శకుల సౌకర్యార్థం డిపార్ట్‌మెంట్ దాదాపు 22,000 చదరపు అడుగుల అదనపు పార్కింగ్ స్థలాన్ని జోడించిందని అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!