న్యాచురల్ స్టార్ నాని సినిమాల లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ఇటీవల హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు మరో యాక్షన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.. ‘సరిపోదా శనివారం’ అనే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చేస్తున్నాడు..
ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్,టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. దసరా లాంటి యాక్షన్ కథతో రాబోతుందని టీజర్ చూస్తే తెలుస్తుంది.. శనివారం రోజున మూవీ టీమ్ ఇచ్చిన అప్ డేట్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది..ఈ సినిమాకు మొదటి నుంచి వెరైటీ పోస్టర్స్ తో హైప్ ను క్రియేట్ చేస్తుంది టీమ్.. తాజాగా ‘స్థిర శనివారం సమవర్తి’ అంటూ నాని చేతికి రక్తం కారుతున్న ఫొటోను షేర్ చేశారు. ఆ పోస్టర్ ను చూస్తే యాక్షన్ సీన్ కు సంబందించిన పోస్టర్ లా కనిపిస్తుంది.. అందులో కనిపిస్తున్న చెయ్యి కి రక్తం కారుతూ కనిపిస్తుంది.. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఈ సినిమాను డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.. భారీగా బడ్జెట్ తో భారీ యాక్షన్ సినిమాగా గా రాబోతుంది.. గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే..ఇప్పుడు విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నారు. ఇందులో నానిని మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్లో ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ భారీ కాన్వాస్తో ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.. ఆగస్టు 29న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు..
స్థిర శనివారం సమవర్తి…🔥
The moments of Fiery Breathing sequences ❤️🔥#SaripodhaaSanivaaram #SuryasSaturday
Natural🌟 @NameIsNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JxBe @muraligdop @karthikaSriniva @SVR4446 @IamKalyanDasari @DVVMovies @SVC_Official @SonyMusicSouth pic.twitter.com/B4D3FdVYeF
— DVV Entertainment (@DVVMovies) March 23, 2024