తన తల్లిని కాపాడేందుకు ముందుకు వచ్చిన ఖడ్గమృగం పిల్ల హృదయాన్ని హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తల్లి ఖడ్గమృగానికి వైద్యం చేసేందుకు వచ్చిన వైద్యుడిపై దాడికి సిద్ధమైన ఈ చిన్నారి.. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తన తల్లి ప్రమాదంలో ఉందని గ్రహించి, బిడ్డ ఖడ్గమృగం తన తల్లిని రక్షించడానికి శాయశక్తులా ప్రయత్నించడాన్ని చూడవచ్చు. చిన్న ఖడ్గమృగం తన కొమ్ముతో డాక్టర్‌పై ఎలా దాడి చేస్తుందో వీడియో క్యాప్చర్ చేస్తుంది. నిజానికి,…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్షపాతం హెచ్చరిక జారీ చేయడంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందనుంది . హైదరాబాద్‌లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒకచోట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తయి పదకొండవ సంవత్సరంలో అడుగుపెడుతోంది
రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ 22 పేజీల బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొనదని ఆ లేఖలో తెలిపారు.
ఏపీ ఫలితాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. ఎగ్జిట్ పోల్స్‌లో అవే చెబుతున్నాయని ఆయన చెప్పారు. తన స్నేహితులు, బంధువుల సమాచారం మేరకు జగన్ రెండోసారి సీఎం అవుతారన్నారు.
హైదరాబాద్‌లోని ఫతేనగర్ ప్రాంతంలో ఒక మహిళ గంజాయి ప్యాకెట్లు అమ్మకాలు జరుపుతుండగా ఎస్‌ఎఫ్‌టీ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఫతేనగర్‌లో షేక్‌జామీన్ బీ అనే మహిళ గంజాయిని అమ్మకాలు సాగిస్తోంది.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ చేపట్టింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. 17 నియోజక వర్గాలలో ఒక్కో పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేకంగా హాల్ ఏర్పాటు చేశామని.. మల్కాజ్‌గిరిలో అదనపు హాల్ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఆ విషయాన్ని కేసీఆర్ నిండు సభలో చెప్పారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కీంలలో స్కామ్‌లు జరిగాయని.. గొర్రెల పథకంలో భారీ స్కాం జరిగిందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్‌తో సహా 12 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తామన్నారు.