నల్గొండ మున్సిపాలిటీలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకర్‌లో మృతదేహం లభించడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నిప్పులు చెరిగారు. ‘నాగార్జునసాగర్ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో ఘోరం’ అంటూ వచ్చిన కథనాన్ని రీట్వీట్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పాతబస్తీ మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో ఓ మృతదేహం లభ్యమైంది. దాదాపు పదిరోజులుగా ప్రజలు అవే నీళ్లు తాగుతున్నారు. తాగునీటిలో తేడా కనిపించడంతో మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి…
బీఆర్‌ఎస్, తెలంగాణ ప్రజలు సుదీర్ఘ పోరాటం చేసి ఢిల్లీ అధికారుల దయతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు ఎస్ వెంకట వీరయ్య, సత్యవతి, నాయకులు కె కోటేశ్వరరావు, కె నాగభూషణం, గుండాల కృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో బిఆర్‌ఎస్ కార్యకర్తలు జెండా పండుగ జరుపుకున్నారు. పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో రాష్ట్రంలో…
ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ తొత్తులు ఇచ్చినవే అని ఎన్టీవీతో మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని, ఎగ్జిట్ పోల్స్ పేరిట బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందన్నారు. బీజేపీ సూచనల మేరకే ఎగ్జిట్ పోల్స్ అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు అద్బుతమైన మెజారిటీ తో గెలుస్తోందని, బీజేపీ మూడు సీట్లలో మాత్రమే బలం ఉందన్నారు మంత్రి పొంగులేటి. ఐదు సీట్లలో కాంగ్రెస్ కు…
తెలంగాణ రాష్ట్రం సాధించి దశాబ్ది ఉత్సవాలు కాదు కాంగ్రెస్ ఉత్సవాలు ను తలపించిందన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. ఇవాళ ఆయన హనుమకొండ జిల్లా పల్లా రవీందర్ రెడ్డి హల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు లో రేవంత్ పాత్ర చెప్పలేదని, ఉద్యమంలో పాల్గొనని వాళ్లు ఉత్సవo చేస్తే ఎలా ఉంటుందో అది కొరవడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సిఎం రేవంత్ ఏమాత్రం సంబంధం లేదని, రాష్ట్ర…
ఇదిలా ఉంటే.. హనుమకొండలోని డీ కన్వెన్షన్ హాలులో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీలు మధు యాష్కీ గౌడ్, సిరిసిల్ల రాజయ్య, సీతారాం నాయక్,…
నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్చార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వారికి పలు సూచనలు చేశారు. పోటాపోటీ ఉన్న…
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. తీహార్ జైలు అధికారులు నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చనున్నారు.
దేశంలో 7 దశలలో జరిగిన లోక్ సభ ఎన్నికలు-2024తో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం ఆసన్నమైంది. దేశంలోని ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్నికల కౌంటింగ్ రేపు(మంగళవారం) జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.