అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి (29) ఆత్మహత్య చేసుకుంది. ఎస్పీ కార్యాలయంలోని సెక్యూరిటీ గార్డ్ రూమ్‌లో తన వద్ద ఉన్న సర్వీస్ తుపాకితో కాల్చుకొని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి ఆత్మహత్య చేసుకుంది.
జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కడప నగరంలో ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వెల్లడించారు. నగర శివార్ల నుంచి బస్సులు, ఇతర వాహనాల దారి మల్లింపులు ఉంటాయన్నారు.
ఎన్నికల ఫలితాలపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులు వేరని.. మాకు ప్రజలపై అపారమైన నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్‌తో సంబంధం లేదని.. 36 గంటలు ఆగితే కరెక్ట్ రిజల్ట్ వస్తుందన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మతిభ్రమించిందని.. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన ఆదివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. "ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ.
ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మోసగాడు పదేళ్లు తెలంగాణ పరిపాలించాడని తీవ్రంగా విమర్శించారు. ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే.. జిన్నా ఆగస్టు 14న వేడుకలు చేసుకున్నాడని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కూడా అట్లనే జూన్ 1 నుండి వేడుకలు చేస్తున్నాడన్నారు.
కౌంటింగ్‌పై పార్టీ శ్రేణులకు అవగాహన కలిగించటం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయం నుండి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. కౌంటింగ్‌లో అనుసరించాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తల పై దిశా నిర్దేశం చేశారు సజ్జల.. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ఏజెంట్లకు బాధ్యత ఉంది…. అధికారం ఉందని, కౌంటింగ్ సెంటర్ లో అలర్టు గా ఉండాలన్నారు. బ్యాలెన్స్ గా ఉండాలి…సంయమనం కోల్పోవద్దన్నారు సజ్జల.…
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలుపు పై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా.. ‘మహబూబ్ నగర్ గడ్డపై ఎగిరిన గులాబీ జెండా.. సీఎం సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు.. మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు.. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు.. పార్టీ విజయం కోసం పని చేసిన ప్రతి ఒక్క…
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌ను నల్లగొండ జిల్లాలోని గాంధీ గుడి కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ ను గాంధీ గుడి సభ్యులు శాలువాతో సత్కరించారు. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు తీసుకున్న చర్యలను గవర్నర్‌కు గాంధీ గుడి సభ్యులు వివరించారు. అంతేకాకుండా.. మద్యపాన నిషేధ ప్రచారాన్ని చేయాలని గాంధీ గుడి సభ్యులకు గవర్నర్ సూచించారు. డబ్బు పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే తాను ఓ ఎన్నికల్లో ఓడిపోయానని…