తెలంగాణ లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. 17 నియోజక వర్గాలలో ఒక్కో పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేకంగా హాల్ ఏర్పాటు చేశామని.. మల్కాజ్‌గిరిలో అదనపు హాల్ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఆ విషయాన్ని కేసీఆర్ నిండు సభలో చెప్పారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కీంలలో స్కామ్‌లు జరిగాయని.. గొర్రెల పథకంలో భారీ స్కాం జరిగిందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్‌తో సహా 12 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తామన్నారు.
చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్న అని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఏ దేశానికి వెళ్ళాడో.. ఎక్కడికి వెళ్ళాడో పార్టీ నేతలకు సైతం తెలియదని, విదేశీ పర్యటన ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి..? అని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఎన్నికల్లో దోచుకున్న డబ్బులు దాచుకోడానికి వెళ్లాడుకనుకే ఇంత రహస్యమన్నారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు.. ఈసారి ఎందుకు…
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరమన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలన్నారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని, దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు. విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డయేరియాతో కాకుండా…
రక్షించాల్సిన పోలీసులే.. భక్షకులుగా మారుతున్నారు. కన్ను మిన్ను కానకుండా స్త్రీలపై తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. బైక్‌పై వెళ్తున్న ఓ జంటను పోలీస్ వాహనంలో తన స్నేహితుడితో కలిసి వచ్చిన ఓ హోంగార్డ్ అడ్డగించి, బెదిరించి మహిళను తుప్పల్లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు దిశ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం నుంచి కుమిలి వెళ్లే రహదారిలో బైక్‌పై తన కుటుంబసభ్యుడితో కలిసి వెళ్తున్న సుమారు 45 ఏళ్ల వయసు…
ఏపీలో నేడు జూన్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. జూన్ 1వ తేదీ కావడంతో పింఛన్లు పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 65.30 లక్షల మందికి నేటి నుంచి పింఛన్లను అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 1,939 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. 80 సంవత్సరాలు పై బడిన పెన్షన్ దారులకు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్ అందించనున్నారు. మిగిన లబ్ధిదారులకు గత నెలలో లాగా బ్యాంకులో జమ చేయనున్నారు.…
జగన్ రెడ్డి మోహన్ తన లండన్ పర్యటన నుండి శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి ఏపీకి చేరుకున్నారు. లండన్ నుంచి రాష్ట్రానికి సీఎం కుటుంబం చేరుకుంది. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ ,మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున,కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ , వెలంపల్లి శ్రీనివాసరావు, కైలే అనిల్ కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, టిజె, సుధాకర్…
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. తాజాగా ఇద్దరు కీలక అధికారులను గొర్రెల స్కామ్‌లో అరెస్ట్ చేసింది.
అమ్మ చివరి కోరిక నెరవేర్చేందుకు 100 దేశాల యాత్రకు శ్రీకారం చుట్టినట్లు నగరానికి చెందిన ఐటీ నిపుణుడు రామకృష్ణ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో స్వచ్ఛమైనది ఏదైనా ఉంది అంటే తల్లి ప్రేమ ఒకటేనని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-ఆపరేషన్స్ టి.రఘునాథరావు పదవీ విరమణ పొందారు. చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ - ఆపరేషన్స్ పి.జీవన్ ప్రసాద్‌తో పాటు మరో ఏడుగురు రిటైర్డ్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీకి ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన వారిని టీజీఎస్ఆర్టీసీ ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికింది.