Fish Prasadam: హైదరాబాద్‌లో చేపమందు ప్రసాదం అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. బత్తిన కుటుంబీకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.
Mrigasira Karte: నేడు మృగశిర కార్తె కావడంతో జిల్లా వ్యాప్తంగా చేపల మార్కెట్లలో సందడి నెలకొంది. మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రజల నమ్మకం.
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల తొలగింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు సంబంధించి నామినేటెడ్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల రాజీనామాలకు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు ప్రభుత్వ అధికారులు. ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. రాజధాని గ్రామాలు, ఎయిమ్స్ సమీపంలోని ప్రాంతాలతో పాటు గన్నవరం పరిసర ప్రాంతాలను కూడా చూస్తున్నారు.
విజయవాడలో వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాలుగు కార్లలో వంశీ ఇంటి వద్దకు వచ్చిన యువకులు.. ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నించారు. వంశీ ఇంట్లోనే ఉన్నాడన్న సమాచారంతో గేట్లు పగులగొట్టే ప్రయత్నం చేశారు.
ఏపీలో వైసీపీ ఓటమిపై రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య స్పందించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు జగన్ అందించారని.. ఎక్కడ ఏమి జరిగిందో ఇప్పటికీ మాకు అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.
సీఎం పేషీలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాల రాజు, నారాయణ్ భరత్ గుప్తాలను ప్రభుత్వం బదిలీ చేసింది.
వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మాణమవుతున్న రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. శిలాఫలకంపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ భరత్ రామ్ పేరుతో పాటు బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరు ఉన్నా పట్టించుకోకండా టీడీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి.
గత ఏడాది కవాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) నుండి 94 కుటుంబాలను తరలించిన రాష్ట్ర అటవీ శాఖ ఇప్పుడు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) నుండి దాదాపు 415 కుటుంబాలను తరలించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపేట, తాటిగిండాల గ్రామాలకు చెందిన 415 కుటుంబాలను తరలించేందుకు ఏటీఆర్ అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కుటుంబాలను నాగర్ కర్నూల్-కొల్లాపూర్ మార్గంలోని బాచారం తదితర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. ATR పరిమితుల…