వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మాణమవుతున్న రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. శిలాఫలకంపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ భరత్ రామ్ పేరుతో పాటు బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరు ఉన్నా పట్టించుకోకండా టీడీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి.
గత ఏడాది కవాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) నుండి 94 కుటుంబాలను తరలించిన రాష్ట్ర అటవీ శాఖ ఇప్పుడు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) నుండి దాదాపు 415 కుటుంబాలను తరలించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపేట, తాటిగిండాల గ్రామాలకు చెందిన 415 కుటుంబాలను తరలించేందుకు ఏటీఆర్ అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కుటుంబాలను నాగర్ కర్నూల్-కొల్లాపూర్ మార్గంలోని బాచారం తదితర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. ATR పరిమితుల…
అమరావతి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు. తన పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపొద్దని నిన్ననే(బుధవారం) చంద్రబాబు స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ వచ్చాయని, బీఆర్‌ఎస్.. బీజేపీ అధర్మ యుద్ధానికి తెర లేపినా మా బలం పెరిగిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ సీటు కూడా గెలిచామని, ప్రజల కోసం పని చేస్తోంది ప్రభుత్వమన్నారు. బీజేపీ నేతలు నోరుంది కదా అని నోరు పారేసుకోవద్దని, బీజేపీ ది బలుపు కాదు వాపు అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైనా బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతుందని,…
కేంద్రమంత్రి రేసులో ఉన్నారా అని ప్రశ్నపై స్పందించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రధానమంత్రి ఏ బాధ్యత ఇచ్చిన నిర్వహిస్తానని తెలిపారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది నిర్వహిస్తాని ఆయన తెలిపారు. నేను ఎప్పుడూ రేసులో ఉండను.. ఎవరికీ ఎం ఇవ్వాలనేది పార్టీ నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వచ్చాయన్న వ్యాఖ్యలపై స్పందించిన లక్ష్మణ్.. రేవంత్ వ్యాఖ్యలు దొంగే దొంగ అన్నట్లు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుందని, కాంగ్రెస్‌కి చావు తప్పి…
చంద్రబాబు మారరు అనే అపవాదు తనపై ఉందని... కానీ మీరు మారిన చంద్రబాబును చూస్తారని.. ఇక అలా ఉండదని.. మీరే ప్రత్యక్షంగా చూస్తారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్టీ ఎంపీలతో జరిగిన భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
చేవెళ్ల ప్రజలు అవగాహనతో ఓట్లు వేసి మోది నీ గెలిపించారని ఎంపీ చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ వేవ్ తోనే చేవెళ్లలో భారీ మెజారిటీ సాధించామన్నారు. షేర్ లింగంపల్లిలో అనుకొని రీతిలో మాకు ఓట్ల మెజారిటీ పెరిగిందని, ఈ సారి పోలీసులు కూడా భాగా పని చేశారు కాబట్టే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. మెదక్ లో విజయం రఘునందన్ రావు ను…
రేపటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభం కానుంది. లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల తాత్కాలిక వాయిదా పడింది. అయితే.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగిసినందున తిరిగి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి వెల్లడించారు. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం రేపు శుక్రవారం నుంచి పునః ప్రారంభం కానున్నట్లు ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్…
ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం జరుగుతుందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. టీడీఎల్పీలో చంద్రబాబుని నేతగా ఎన్నుకుని గవర్నర్ కు నివేదిక పంపుతామన్నారు.