Fish Prasadam: హైదరాబాద్‌లో చేపమందు ప్రసాదం అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ రోజు ఉదయం 9 గంటలకు నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రారంభించనున్నారు. ముందుగా బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లోని స్పీకర్ క్వాటర్స్ వద్ద నాయకులు సమావేశమయ్యి అక్కడ నుంచి నాంపల్లి కి బయలుదేరుతారు. కాగా.. బత్తిన కుటుంబీకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా చేపమందు అందించనున్నందున అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆస్తమాతో సహా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చేప మందు చాలా సంవత్సరాలుగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ చేపప్రసాదాన్ని ఆస్తమా రోగులకు అందించేందుకు నేడు, రేపు అనగా 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సిద్దం చేశారు. ఈ చేపమందు ఆస్తమా రోగులకు దివ్య ఔషధంలా పనిచేస్తుందన్న తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. నిన్నటి నుంచే నాంపల్లి గ్రౌండ్ కు బారులు తీరారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కౌంటర్లు ఏర్పాటు చేసి సీక్వెన్షియల్ ఆర్డర్‌లో ఈ మందును అందజేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు అధికారులు. మృగశిరకార్తె రోజున అందించే ఈ చేపమందు ప్రసాదం కోసం నిన్న రాత్రి నుంచే వచ్చి క్యూలో వేచి ఉన్నారు.
Read also: Sharwanand: హీరో శర్వానంద్‌కు బిరుదు.. ఏ స్టార్ అంటే?
అందుకు అనుగుణంగా అధికారులు లైట్లు, బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. బత్తిన కుటుంబం కొన్ని దశాబ్దాలుగా ఈ చేప మందును ఉచితంగా అందజేస్తోంది. బత్తిన శంకర్‌గౌడ్ తమ తాతగారికి ఈ మందు తయారు చేసే విధానాన్ని ఓ సాధువు నేర్పించారని పురాణం. అయితే ఆస్తమా రోగులకు ఈ మందు ఉచితంగా ఇస్తే కుటుంబానికి మేలు జరుగుతుందని, అప్పటి నుంచి ఈ చేప ప్రసాదం ఉచితంగా ఇస్తున్నామన్నారు. హరినాథ్ గౌడ్ ఇటీవల మృతి చెందినప్పటికీ… ఈ ఏడాది ఆయన కుటుంబ సభ్యులు చేపమందు పంపిణీ చేయనున్నారు.
కాగా.. చేప ప్రసాదం కోసం ఏటా వేలాది మంది వస్తుంటారు. కానీ చేప నైవేద్యంలో ఉపయోగించే మిశ్రమాన్ని బట్టి కుటుంబీకులు ఉచితంగా అందజేస్తారు, అయితే చేపలను సొంతంగా కొనుగోలు చేయాలి. ఇందుకోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆవరణలోని ప్రత్యేక స్టాళ్లలో కొర్రమీను, చేప పిల్లలను విక్రయిస్తున్నారు. మృగశిరకర్త నుండి వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. వర్షంతోపాటు చల్లటి గాలులు వీస్తుండటంతో ఆస్తమా రోగులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే మృగశిరకార్తె ప్రారంభం రోజున ఈ మందు పంపిణీ చేస్తారు.
Secendrabad: సిగ్నల్ పడుతుందని స్పీడ్ పెంచిన డ్రైవర్.. మూడు సార్లు పల్టీ కొట్టిన కారు..