వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలియకపోయినా ఏపీ ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఇద్దరూ ఓడిపోయి మిత్ర ధర్మాన్ని పాటించారని మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు. ‘తెలంగాణలో BRS(కేటీఆర్) ఓడితే జగన్ పట్టించుకోలేదు. మీరు మాత్రం ఆయనను ఓదారుస్తున్నారు. YCP పరాజయం కంటే ముందు తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఆలోచించుకోవాలి’ అని హితవు పలికారు రఘురామకృష్ణం రాజు. ఇదిలా ఉంటే.. ఏపీలో వైసీపీ, కేతిరెడ్డి…
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పంది. ఈ నెల 18నుంచి ఆన్ లైన్ అక్టోబర్ నెల దర్శన టిక్కెట్ల విడుదల చేయనున్నట్లు పేర్కొంది. భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు టీటీడీ అధికారులు. రోజు రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.. నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అన్నప్రసాద సముదాయంలో యంత్రాల ఆధునీకీకరణ, ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. అటు తిరుమలలో సాధారణంగా భక్తుల…
గ్రూప్ 2 పోస్టులను పెంచి డిసెంబర్ నెలలో పరీక్షలను నిర్వహించాలని గ్రూప్-2 అభ్యర్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రూప్-2 అభ్యర్థులు మాట్లాడారు.
తెలంగాణలో 15 మంది సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఫోన్ నెంబర్లు, ఫోటోలు బహిర్గతం కావడంపై హైకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇక మీద ఇలా జరిగితే కోర్టు ఉల్లంఘనల కిందకు వస్తుందని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
తెలంగాణ ఆర్టీసీలో భర్తీ చేసే ఉద్యోగాలపై ఎండీ వీసీ సజ్జనార్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరిట ఆన్‌లైన్‌లో వస్తున్న లింకులను నమ్మవద్దని ఆయన కోరారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎండీ వీసీ సజ్జనార్ కీలక అలర్ట్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఇటీవల ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో మెట్‌పల్లి పట్టణానికి చెందిన జనమంచి సాయిశిల్ప రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించింది. ఇంగ్లీష్ సబ్జెక్టులో 450 మార్కులకు గాను 325.657 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. గతంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన సాయిశిల్ప తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (గురుకులం పాఠశాలలు) నిర్వహించిన డిగ్రీ లెక్చరర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో స్టేట్ సెకండ్ ర్యాంక్ కూడా సాధించింది.…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై ఏపీ మంత్రి సత్య కుమార్ విమర్శలు గుప్పించారు. “ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూ మాఫియా మాదిరే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజల ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు, కొండలను కూడా అతడు కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా… కలెక్షన్… కరప్షన్… కమీషన్లే! ఫాంహౌస్ కు పరిమితమైన మీరు ఎక్స్ లో అడిగినా అతడి…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ అంబర్‌పేట్, బాగ్ అంబర్పేట్ డివిజన్ లలో పర్యటించారు. సంభంధిత అధికారులను వెంటపెట్టుకొని పర్యటించిన కిషన్ రెడ్డి గారు మొదట అంబర్పేట్ డివిజన్ పటేల్ నగర్ చౌరస్తాలో స్థానిక ప్రజలతో కాసేపు ముచ్చటించారు ప్రజల నుంచి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు తర్వాత అక్కడే ఉన్న పటేల్ నగర్ గోశాల లో పశువుల సేవలో గడిపారు అనంతరం ప్రేమ్ నగర్ బస్తిలో…
ఖమ్మం కలెక్టరేట్లో రైతు భరోసా పథకంపై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ర్ట వనరులు, సంపద ప్రజలకే పంచుతామన్నారు. రైతు బంధు పేరుతో ఒకే సారి నిధులు విడుదల చేశామని, రైతు భరోసా అమలుకు బడ్జెట్ సమావేశం లో నిధులు కేటాయించనున్నామన్నారు భట్టి విక్రమార్క. శాసనసభ లో చర్చ కు పెడతామని,…