తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు రానున్న రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది. జులై 12 వరకు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని, దీంతో ఎల్లో అలర్ట్‌ను జారీ చేయాలని డిపార్ట్‌మెంట్‌ని కోరింది. ఈ నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణలో గణనీయమైన వర్షపాతం నమోదైంది, రాష్ట్రంలో…
రాజమహేంద్రవరం రూరల్ ఈరోజు రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన గోదావరి ఘాట్స్ పరిశీలన కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్, శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొ్న్నారు. ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పుష్కర సన్నాహాలు ప్రారంభమయ్యాయని, గతంలో జరిగిన మూడు పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అని ఆయన గుర్తు చేశారు. పరిమిత వనరులుతో గోదావరి తీరాన్ని అభివృద్ధి…
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఎన్టీటీపీఎస్ ప్రమాదంలో గాయపడి గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. ఈ సందర్భంగా వారు బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాదం గురించి మంత్రి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమ అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. ఎన్టిటిపిఎస్ లో…
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న బీసీ సంక్షేమ భవన్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత సందర్శించారు. బీసీ సంక్షేమ భవన్‌లో ఉన్న వివిధ బీసీ కార్పొరేషన్ల విభాగాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. 2014- 19 లో చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు పెద్దపెట్టవేశామని, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందన్నారు. టీడీపీ పాలనలో బీసీ సంక్షేమ…
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉచిత ఇసుక అమ్మకాలను రాష్ట్ర టూరిజం మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ప్రారంభించారు. రాజమండ్రి లాలాచెరువు స్టాక్ పాయింట్ వద్ద క్యూ కట్టారు ఇసుక వినియోగదారులు. టన్ను ఇసుక ధర 270 రూపాయలుగా నిర్ణయించారు. ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా కేవలం నిర్వహణ ఖర్చులు చట్టబద్ధమైన పనులు మాత్రమే వసూలు చేస్తోంది. ఇసుక అక్రమ రవాణా చేసిన వారికి రెండు లక్షల వరకు జరిమానా రెండు సంవత్సరాలు జైలు శిక్ష…
వైఎస్ఆర్ జిల్లా కడపలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పులివెందుల ఎమ్మెల్యే గా వైఎస్ జగన్ రాజీనామా, కడప ఎంపీ గా వైఎస్ అవినాష్ రాజీనామా అంటూ వచ్చిన వార్తలను ఖండించారు. కేవలం దుష్ప్రచారం చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సురేష్ బాబు.. 2011 లో జరిగిన కడప పార్లమెంట్ ఉప ఎన్నికలలో కడప దెబ్బ…
బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నేత కార్మికులను వదిలిపెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏడేళ్లుగా కొనసాగిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీని పునఃప్రారంభించాలని ఆయన కోరారు. ఈ వార్తా కాలమ్‌లలో ప్రచురితమైన వార్తా కథనం – “బతుకమ్మ చీరల పథకానికి శ్రీకారం చుట్టిందా?” అని రామారావు స్పందిస్తూ, కష్టాల్లో ఉన్న పేద నేత కార్మికుల పట్ల…
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన తెలుగు విద్యార్థి అమెరికాలో మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం గద్దె శ్రీనివాసరావు కుమారుడు అయిన సూర్య అవినాష్ శశి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు.. అనంతరం ఉన్నత చదువులకై అమెరికా లోని న్యూ జెర్సీలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు… సోమవారం ఉదయం తన…
నేడు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ జరగనుంది. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమావేశంలో చర్చించనున్నారు. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై ఎస్ఎల్బీసీ తో చర్చించే అవకాశం ఉంది. అనంతరం విద్యుత్‌శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తారు. ఈ సమావేశంలో.. వ్యవసాయ రుణాలు,…
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రదేశాలలో మెరుపులతో కూడిన ఉరుములు, ఈదురు గాలులు (30-40 kmph) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్లలో…