నిరుద్యోగులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) శుభవార్త చెప్పింది. ఈ మేరకు 64 పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్స్, సీనియర్ సైంటిఫిక్ అధికారి, మెడికల్ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు యూపీఎస్‌సీ తెలిపింది.
అర్హులైన అభ్యర్థులు సంబంధిత పోస్టుల కొరకు నవంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూపీఎస్‌సీ తెలిపింది. ఈ నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాల కోసం upsconline.nic.in వైబ్ సైట్‌ను సందర్శించవచ్చు.