రోడ్డుపై వెళుతుంటే అనుకోకుండా చిన్నచిన్న జంతువుల మనకు తారసపడుతూనే ఉంటాయి. కానీ.. ఏకంగా ఓ మొసలి జాతీయ రహదారిపై కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటనే విజయనగరం రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని నెలివాడ చెరువు సమీపంలోని రోడ్డుపైన మొసలి ప్రత్యక్షమైంది. దీంతో ఆ మొసలిని గమనించిన వాహనదారులు రోడ్డుకు ఇరువైపులా ఆగిపోయారు.
దాదాపు గంటసేపు మొసలి రోడ్డుపైనే ఉండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తరువాత మొసలి సమీపంలోని చెరువులోకి వెళ్లడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు. అంతేకాకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.