రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తమిళ మూవీ ‘అన్నాత్తె’ తెలుగులో ‘పెద్దన్న’గా రాబోతోంది. ఈ మేరకు బుధవారం చిత్ర యూనిట్ పెద్దన్న మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రంలో హీరో రజనీకాంత్‌కు చెల్లెలి పాత్రలో మహానటి ఫేం కీర్తి సురేష్ నటించింది. మరోవైపు నయనతార, మీనా, ఖుష్బూ వంటి నటీమణులు కీలక పాత్రలను పోషించారు.
Read Also: తమన్నా పరువు అడ్డంగా తీసిన ‘మాస్టర్ చెఫ్’ యాజమాన్యం
‘నువ్వు ఎవరు అనేది నువ్వు వెనకేసుకున్న ఆస్తిలోనో.. లేదా నీ చుట్టూ ఉన్నవాళ్లకు నీ మీద ఉన్న భయంలోనో లేదు’ అంటూ రజనీ చెప్పే డైలాగుతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. రజనీకాంత్ అభిమానులు కోరుకునే యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలతో ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతం సమకూర్చాడు.