ఎన్ని రికార్డులకు కొలువైన తెలంగాణలో పుట్టిన ఓ కుర్రోడు తనకంటూ మరో రికార్డు క్రియేట్ చేశాడు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ఎస్) లో విద్యానభ్యసిస్తున్న పి. అశోక్ (17) అనే విద్యార్థి చరిత్ర సృష్టించాడు. యూపీఎస్సీ నిర్వహించిన ప్రవేశ పరీక్షతో పాటు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూలో తన ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణుడిగా నిలిచాడు. దీంతో నేషన్ డిఫెన్స్ అకాడమీక (ఎన్‌డీఏ)కు ఎంపికయ్యాడు. అంతేకాకుండా టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికైనా తొలి క్యాడెట్‌గా…
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిదేడు గ్రామానికి చెందిన వైష్ణవి అనే చిన్నారి తమ ఊరికి బస్సు సౌకర్యం లేదని, స్కూల్ వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసింది. దీంతో భారత సర్వోన్నత న్యాయస్థాన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వైష్ణవి రాసిన లేఖకు స్పందించారు. వెంటనే చిదేడు గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని టీఎస్‌ఆర్టీసీని ఆదేశించారు. ఎన్వీ రమణ ఆదేశాల మేరకు…
తెలంగాణలో నర్సింగ్ విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జీఎన్‌ఎం, బీఎస్సీ, నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు స్టైఫండ్ నెలకు రూ. 1500లు ఉండగా రూ.5 వేలకు పెంచింది. అంతేకాకుండా సెకండ్ ఇయర్ విద్యార్థులకు రూ.1700 నుంచి రూ. 6 వేలకు పెంచగా, మూడో సంవత్సరం విద్యార్థులకు రూ. 1900 నుంచి రూ.7వేలు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు రూ.2,200 నుంచి…
విజయనగరం జిల్లాలోని ఎన్‌సీఎస్ షుగర్స్ ఫ్యాక్టరీ ముందు రైతులు తమకు రావాల్సి బకాయిల కోసం నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనను విరమింపజేయడానికి ప్రయత్నించడంతో పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనిపై స్పందించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ప్రజలైనా, ప్రతి పక్షమైనా, చివరికి అన్నదాతలనైనా ప్రశ్నిస్తే.. ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా అణిచివేస్తోందని అన్నారు. Read Also : ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డ 400 సంవత్సరాల గణపతి విగ్రహం అంతేకాకుండా చెరకు రైతులపై ప్రభుత్వం…
చెన్నై ఎయిర్ పోర్ట్ కార్గోలో 400 సంవత్సరాల పురాతన నృత్య గణపతి విగ్రహాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. చెన్నై నుండి కోయంబత్తూర్ వెళుతున్న ఓ పార్శిల్ లో ఈ గణపతి విగ్రహాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా పురాతన విగ్రహాన్ని చెన్నై వయా కోయంబత్తూర్ మీదుగా విదేశాలకు తరలిస్తుండగా అధికారులు వారి పథకాన్ని భగ్నం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు చెన్నై ఎయిర్‌పోర్ట్ లోని కార్గో పై ప్రత్యేక దృష్టి సారించినట్లు…
తిరుపతిలో నవంబర్ 14న జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరుగనుంది. అయితే కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో జగన్ సమావేశమయ్యారు. ఏపీ విభజన చట్టంలో పెండింగులో ఉన్న అంశాలు, తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టులో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రూ. 6300 కోట్ల విద్యుత్‌బకాయిలు,…
తనకు సంబంధంలేని కేసులో నన్ను వేధిస్తున్నారని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన లాలాగూడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లాలపేటలో నివాసం ఉంటున్న రాజేష్ అనే వ్యక్తి గత నెల 27న ఒకరిపై దాడి చేశాడని లాలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సదరు రాజేష్‌ను పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. గొడవకు నాకు సంబంధం లేకున్నా నాపై అక్రమంగా కేసు…
భారత్‌ను ఓ వైపు కరోనా వైరస్, మరోవైపు డెంగీ వ్యాధి కలకరపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా డెంగీ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో గత ఏడాది ఇదే నెలలో నమోదైన డెంగీ కేసుల కంటే ఈ ఏడాది ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న 9 రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందాలను పంపించింది. ఈ జాబితాలో కేరళ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి. కేంద్రం…
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ శాఖ పరిధిలోకి కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కార్పొరేషన్లు రానున్నాయి. Read Also: వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి ఇదేనా? అలాగే జైన్ల సంక్షేమానికి, సిక్కుల…