భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) దేశీయంగా అభివృద్ధి చేసిన స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్ ను ఇండియాన్ ఎయిర్‌ఫోర్స్‌తో కలిసి విజయవంతంగా పరీక్షించాయి. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల బంకర్లు, రాడార్లతో పాటు రన్‌వేలు, ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్లను, రీన్ ఫోర్స్ నిర్మాణాలను ఈ మిస్సైల్ ధ్వంసం చేస్తుంది.
దీనిలో ఉన్న ఎలక్ట్రో ఆప్టికల్, శాటిలైట్ నావిగేషన్ సెన్సార్ల ఆధారంగా రెండు వేర్వేరు కాన్ఫిగరేషన్లను విజయవంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. శాస్త్రవేత్తలు ఐఐఆర్ (ఇమేజింగ్ ఇన్‌ఫ్రా రెడ్) టెక్నాలజీని ఉపయోగించి ఈ పరీక్షలు నిర్వహించారు.