ఓ వార్డు వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వార్డు వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రవి కుమార్ అనే వ్యక్తి తాడేపల్లిలో నిన్నటి నుంచి కనిపించడం లేదు. అయితే రవికుమార్ ఈ రోజు నదిలో శవమై కనిపించాడు. దీంతో రవికుమార్ శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ మేరకు కేసు నమోదు చేయడంతో అతడు వాలంటీర్ రవికుమార్‌గా గుర్తించారు. అంతేకాకుండా అతడి వద్ద సూసైడ్ నోట్ కూడా లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆ సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.