న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తా : ఉత్తమ్ కుమార్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పై నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో ఖరీఫ్ పంట కొనుగోళ్లలో, రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులకు మద్ధతు ధర లభించడం లేదని, ప్రభుత్వ తీరు మారకుంటే కాంగ్రెస్ రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
రైతులకు న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానన్నారు. లక్షల కోట్లు ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో విఫలమైందని ఆరోపించారు. ఖరీఫ్ పంట కొనుగోలు పై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదు, ఇప్పటి వరకు గ్రామాల్లో
కొనుగోలు కేంద్రాలు ఎందుకు తెరవలేదు..? అని ప్రశ్నించారు. రైతుల ధాన్యం ఆమ్ముకోవడానికి రోజుల తరబడి వేచి చివుడాల్సి వస్తోందని, రబీ పంటలో వరిపై ఆంక్షలు పెట్టొద్దన్నారు. పంట కొనుగోలు పై అవగాహన లేకుండా ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతున్నారని, రైతులకు ఇష్టమైన పంట వేసుకునే స్వేచ్ఛ వారికి కల్పించాలన్నారు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
పోడు భూముల విషయంలో అమాయక గిరిజనులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు. అంతేకాకుండా ‘వరి పంట వేయొద్దనడానికి మీరెవరు. ధనిక రాష్ట్రంలో ప్రతి గింజ కొంటామన్న ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు. తక్షణమే ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి. టోకెన్ల పంపిణీలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు రోజుల తరబడి వేచిచూడాల్సి వస్తుంది’ అని ఆయన వెల్లడించారు.
- Tags
- congress
- congress mp
- kcr
- latest news
- TRS
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!