ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్ తో పాటు కుప్పం పెండింగ్‌లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కాగా అందరి దృష్టి ఇప్పుడు కుప్పం మున్సిపల్ ఫలితాలపైనే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటైన కుప్పంలో ఈ సారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలని నిర్ణయించుకుంది.
కుప్పంను వదులుకునే ప్రసక్తి లేదని టీడీపీ నేతలు సైతం భీష్మించుకున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం ఫలితాలపై ఏపీ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో మిగితా మున్సిపాలిటీల కంటే కుప్పం ఫలితాలపైనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల్లో ఉత్కంఠ నెలకొంది. మరి కొన్ని గంటల్లో కుప్పం పీఠంపై కూర్చునేదెవరో తేలిపోనుంది.