ఏపీలో నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు పెండింగ్‌లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు పోలింగ్ జరిగిన విషయం తెలసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తాజాగా ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ని టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ-టీడీపీ మధ్య హోరాహోరీగా ఎన్నికల పోరు సాగింది. మొత్తం 20 వార్డులకు గాను టీడీపీ 13 వార్డులు గెలుచుకొని దర్శి నగర పంచాయతీ చైర్మన్…
హాలిడే ట్రిప్‌లో ఎంజాయ్ చేద్దామని బీచ్‌కు వెళ్లిన దంపతులకు ఊహించని షాక్ ఎదురైంది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంటికి తిరిగివచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. గుజరాత్‌కు చెందిన అజిత్-సరళ దంపతులు హాలిడే ట్రిప్ కోసం దయూలోని నంగావ్ బీచ్‌కు వచ్చారు. అక్కడ పారా సెయిలింగ్ చేయాలనుకున్నారు. దీంతో పారా సెయిలింగ్ నిర్వాహకులు వారిని పవర్ బోట్ సహాయంతో పారాచూట్ ద్వారా ఆకాశంలోకి పంపించారు. అలా సముద్రంలో పారా సెయిలింగ్ చేస్తున్న దంపతులు ఒక్కసారిగా…
ఏపీ ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తోంది. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు ఎన్నికలు జరుగగా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ 14 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ అభ్యర్థులు 2 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిననాటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేయాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగానే వైసీపీ అభ్యర్థులు…
ఏపీలోని 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని కమలాపురం నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. కమలాపురం మునిసిపాలిటీలోని 20 వార్డుల్లో 15 వైసీపీ, 5 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. 01, 06, 12, 13, 19 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. Also Read:బద్దలైన చంద్రబాబు కంచుకోట.. కుప్పంలో వైసీపీ దూకుడు.. 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11, 14,15,…
చెన్నై అంతర్జాతీయ పోస్టాఫీసులో ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు గంజాయి పట్టుబడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అమెరికా, నెదర్లాండ్స్ నుండి చెన్నై వచ్చిన మూడు పార్శిల్ లో డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా మూడు పార్శిల్ లో డ్రగ్స్ దాచి కేటుగాళ్లు పోస్టాఫీసు ద్వారా చెన్నై చిరునామాకు పంపించారు. పార్శిల్స్ స్కానింగ్ లో డ్రగ్స్ సరఫరా తతంగం బయటపడింది. పార్శిల్ పంపిన అమెరికా, నెదర్లాండ్స్ చిరునామాలపై కస్టమ్స్ బృందం…
ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 12 నుంచి 22వరకు వైభవోపేతంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. అయితే నేడు 6వ రోజు సందర్భంగా విశేషాలను తెలుసుకుందాం.. కాజీపేట గణపతి కోటి గరికార్చన, గణపతి విగ్రహాలకు గరికార్చనతో పాటు కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక కళ్యాణం అనంతరం మూషిక వాహనంపై ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.…
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైలార్ దేవ్ పల్లి వినాయకనగర్ బస్తీలోని పరుపుల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. మంటలను చూసిన స్థానికులు అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగ కమ్మేయడంతో బస్తీ వాసులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు.…
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకన్న కుప్పం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాపై ఆంక్షలు విధించారు. విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధులపై కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసుల తీరుపై జర్నలిస్టులు మండిపడ్డారు. Also Read: వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఇదే కాకుండా పలు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు…
ఏపీ వ్యాప్తంగా నకిలీ చలాన్ల స్కామ్ సంచలనం సృష్టించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పలువురు సబ్ రిజిస్ట్రార్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ధర్మనా కృష్ణదాస్ మాట్లాడుతూ.. 51 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల ద్వారా లావాదేవీలు జరిగాయని వెల్లడించారు. ఈ నకిలీ చలాన్ల వల్ల రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. Also Read: షాకిచ్చిన ఆకివీడు పోస్టల్ బ్యాలెట్ అంతేకాకుండా రూ.9.34 కోట్లు రికవరీ చేసినట్లు…
ఎన్ని చట్టాలు చేసినా మృగాళ్లు మాత్రం భయపడడం లేదు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. అయితే తాజాగా మరో కీచకుడి ఉదంతం బయట పడింది. విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఎలక్ట్రికల్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి.. గత మూడు నెలల క్రితం బదిలీపై వచ్చిన ఓ మహిళా సబ్ ఇంజనీర్‌ను లైంగికంగా వేధించాడు. ఏఈ వెకిలి చేష్టలు శృతిమించడంతో సదరు మహిళా సబ్ ఇంజనీర్…