కృష్ణ బోర్టుకు చెందిన సభ్యులు రెండవ రోజు నాగర్జున సాగర్‌పై పర్యటించారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ అధికారులతో కేఆర్‌ఎంబీ బృంద సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం కేఆర్‌ఎంబీ బృంద సభ్యులు మాట్లాడుతూ.. సాగర్ స్థితిగతులు తెలుసుకొని రూట్‌మ్యాప్ తయారీ చేసినట్లు వెల్లడించారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ పరిశీలించి నివేదికలు పంపుతామని తెలిపారు. నాగార్జున సాగర విద్యుదుత్పత్తి కేంద్రాలను పరిశీలించలేదని, వచ్చే పర్యటనలో విద్యుదుతప్పత్తి కేంద్రాలు పరిశీలించి నివేదిక సమర్పిస్తామని వారు పేర్కొన్నారు.