ఏపీ వ్యాప్తంగా నకిలీ చలాన్ల స్కామ్ సంచలనం సృష్టించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పలువురు సబ్ రిజిస్ట్రార్‌లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ధర్మనా కృష్ణదాస్ మాట్లాడుతూ.. 51 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల ద్వారా లావాదేవీలు జరిగాయని వెల్లడించారు. ఈ నకిలీ చలాన్ల వల్ల రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.
Also Read: షాకిచ్చిన ఆకివీడు పోస్టల్ బ్యాలెట్
అంతేకాకుండా రూ.9.34 కోట్లు రికవరీ చేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. అయితే 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 జులై 31 మధ్య జరిగిన చెల్లింపులను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నకిలీ చలాన్ల స్కామ్‌కు సంబంధం ఉన్న సబ్ రిజిస్ట్రార్‌లను విధుల నుంచి తొలగించినట్లు ఆయన వెల్లడించారు.