నేడు ఏపీలో నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు పెండింగ్‌లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వైసీపీ జెండా ఎగరవేసింది. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో కూడా వైసీపీ తన సత్తా చాటింది. ఈ నేపథ్యంలో మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు స్వీయ తప్పిదాలే టీడీపీ పతనానికి కారణమని ఆరోపించారు.
చంద్రబాబు అమరావతి ఒక్కటే తన ఎజెండా అనుకున్నారని, అందుకే మిగతా ప్రాంతాల ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఇప్పుడైనా వాస్తవ పరిస్థితులను చంద్రబాబు గమనించాలన్నారు. కుప్పం ప్రజలు వాస్తవాలను గుర్తించే చంద్రబాబును పక్కన పెట్టారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో టీడీపీ కనుమరుగవుతుందని ఆయన అన్నారు.