తెలుగు రాష్ట్రాల్లో గంజాయి పండుగ మళ్లీ మొదలైంది. అదేంటి అనుకుంటున్నారా.. అవునండి మొన్నటి వరకు భారీ వర్షాలతో గంజాయి రవాణా ముఠాకు అడ్డంకి వచ్చిపడింది. ఇప్పుడు కొంచెం వరుణుడు విరామం తీసుకుందామని తెలుగు రాష్ట్రాలకు సెలవు ప్రకటించాడో లేదో.. మళ్లీ గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నాయి. అయితే వారు రెచ్చిపోతే మేము తగ్గేదేలే అంటున్నారు పోలీసులు.
తాజాగా హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. 10 టైర్ల లారీలో ఏపీ నుంచి మహారాష్ట్రకు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు నిందితులు వినియోగించిన ఓ కారును కూడీ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే దీనిపై ఈ రోజు 3 గంటలకు సీపీ మహేశ్ భగవత్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఏపీలోనూ రోజూ భారీగా గంజాయి పట్టుబడుతోంది.