యావత్తు ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసిన కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే నిన్న పటాన్‌చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహించగా 43 మంది విద్యార్థులతో పాటు ఒక లేడీ లెక్చిరల్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది.
అయితే కరోనా సోకిన విద్యార్థులను పాఠశాలలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనా సోకిన విద్యార్థుల్లో 25 మంది విద్యార్థినీలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వీరితో పాటు మరో ముగ్గురు బాలికలకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.