సీఎం కేసీఆర్ నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. అయితే ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం కేసీఆర్ ఈ రోజు నల్గొండ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య చిత్రపటం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం భోజనం తరువాత సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుంచి…
ఇటీవల వంగవీటి రాధా తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకు ప్రభుత్వం భద్రత కల్పించనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాసారు. వంగవీటి రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరుపాలని చంద్రబాబు కోరారు. దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున నటించిన పుష్ప సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు పుష్ప సినిమా పోస్టర్ చూసాను, ఆ సినిమాను నేను చూస్తాను.. ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి పుష్ప సినిమాలో చూపించారు. ఆ సినిమాలో విధంగా ఏపీలోనూ జరుగుతోందని ఆయన అన్నారు.…
సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగారం కోసం వెళ్లిన జనం ఒక్కసారి బంగారం గని కూలిపోవడంతో 38 మంది మృతి చెందినట్లు సూడాన్ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ వెల్లడించింది. సూడాన్ రాజధాని ఖార్టోమ్‌కు 700 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గత కొంత కాలం క్రితమే సూడాన్ ప్రభుత్వం ఈ బంగారం గనిని మూసివేసింది. బంగారం కోసం స్థానిక ప్రజలు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సూడాన్‌లో…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌ను గజగజలాడిస్తోంది. ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తూ ప్రజలపై విరుచుకుపడుతోంది. భారత్‌లో కొత్తగా 127 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో ఒమిక్రాన్ కేసుల సంఖ్య దేశంలో 781కు చేరుకుంది. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 23 రాష్ట్రాలకు విస్తరించింది. మహారాష్ట్రలో 167 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 238, కేరళలో 57, గుజరాత్‌లో 49, పుదుచ్చేరిలో కొత్తగా 2 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే…
ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల ధరలు, సినిమా థియేటర్ల మూసివేత హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో నేడు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు మంత్రి పేర్ని నానితో టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేతపై చర్చించి వారి ప్రతిపాదనలు అందించారు. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. సినిమా హాళ్లలో వసతులు మెరుగుపర్చాలని గతంలోనే చెప్పామని, సమయం ఇచ్చినా మార్పు లేకపోవడంతోనే తనిఖీలు చేశామన్నారు.…
సూర్యాపేటలో తెలంగాణ ప్రాంత శిక్షణ తరగతులలో భాగంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో 124, 2018 లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయని, స్థానికత ఆధారంగా 3 సంవత్సరాల్లో బదిలీలు చేయాలని కోరారు. కానీ 3 సంవత్సరాలు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కి పరిమిత అయ్యి, ఉద్యోగ, టీచర్ల సంఘాలతో చర్చలు జరపకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి కేసీఆర్ ఇప్పుడు పరుగులు పెడుతున్నారని ఆయన…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పటికీ కొన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో సినిమా నడుస్తోంది. ఈ నేపథ్యం చిత్ర యూనిట్ పుష్ప థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈవెంట్‌ను ప్రత్యక్షప్రసారం ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్లో వీక్షించడానికి ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేయండి. ‘తగ్గేదేలే’….
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఉత్తమ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్లు ఏడున్నర ఏళ్లుగా డైరెక్టుగా అలయెన్స్ లో ఉన్నారని, అందుకే టీఆర్ఎస్ కేంద్రం ప్రవేశపెడుతున్న ప్రతి బిల్లుకూ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందంతో పని చేస్తున్నాయని ఆయన విమర్శించారు. 120 ఏళ్ల సింగరేణి సంస్థకు ఎంతో ఘన…
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు. ఈ మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారాన్ని వీక్షించేందుకు ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేయండి.