టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. చిల్లర ప్రయత్నాలతో కాంగ్రెస్ చరిత్రను రూపు మాపలేరని, దేశానికి మంచి రోజులు రావాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. అంతేకాకుండా సోనియా గాంధీ నాయకత్వంలోనే దేశానికి రక్షణ కలుగుతుందని ఆయన అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలను భూస్థాపితం చేయాల్సిన బాధ్యత గాంధేయ వాదులపై ఉందన్నారు. పార్లమెంట్ లో…
బీజేపీ నిర్వహించే ప్రజాగ్రహ సభ చరిత్రలో బూటకంగా నిలిచిపోతుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న బీజేపీకి ఏపీలో ఉన్న బీజేపీకి చాలా తేడా ఉందని, రాష్ట్రంలో ఉన్న బీజేపీ జగన్ కు అనుకూలంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.పశ్చిమబెంగాల్ లో చీమ చిటుక్కుమన్నా కేంద్ర హోంమంత్రి వెళతారని, ఏపీలో ఏమి జరిగినా కేంద్రం మాట్లాడటం లేదని ఆయన అన్నారు. కేంద్రం టెలిస్కోప్ లో రాష్ట్ర రాజకీయలను చూస్తుందని కేంద్ర…
ఏపీ బీజేపీపై మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఎజెండానే బీజేపీ ఎజెండా అని ఆయన ఆరోపించారు. బీజేపీ నాయకులు ఏపీలో బ్రాందీ ధరలు పెరిగినందుకు బాధపడుతున్నారని, వారు బాధపడాల్సింది డిజీల్, పెట్రోల్ ధరలు పెరిగినందుకు అని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు పెట్రోల్, డిజీల్ ధరలు ఇప్పటి ధరలు పరిశీలించాలన్నారు. అంతేకాకుండా సుజనా చౌదరి, సీఎం రమేష్‌లకు బీజేపీ పార్టీని లీజుకు ఇచ్చారని,…
ఏపీలో ఇళ్ల పట్టాలు సహా 16 పథకాలకు అర్హులైనా లబ్దిపొందని వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు ఏపీ సీఎం జగన్ మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
ఇప్పటికే ఆనారోగ్యంతో బాధపడుతున్న బీసీసీఐ చీఫ్ గంగూలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయనను కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు ఈ ఏడాది జనవరిలో గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పడు వైద్యులు గంగూలీ హార్ట్‌లో మూడు బ్లాక్స్‌ను గుర్తించి వెంటనే చికిత్స చేశారు. దీంతో గంగూలీకి ప్రాణాపాయం తప్పింది. అయితే ఇప్పుడు ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీమిండియాకు కెప్టెన్‌గా బాధ్యత వహించిన గంగూలీ..…
ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్ల ధరలపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న సినిమా థియేటర్లను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి పేర్ని నాని సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారం వీక్షించేందుకు క్రింద…
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకు గ్రామల నుంచి పట్టణాల వరకు అన్ని చోట్ల రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట పొగమంచు కారణంగా రోడ్లపై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వెళ్లే వారికే కాకుండా విమానాల రాకపోకలకు సైతం ఇబ్బంది నెలకొంది. తాజాగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఈ రోజు ఉదయం ఎయిర్‌ఇండియా సంస్థకు చెందిన ఓ విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే ల్యాండింగ్ సమయంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ రన్‌పై…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు 11వ పీఆర్సీపై అమలు చేయాలని కోరుతూ నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సీఎస్ సమీర్ శర్మ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి పీఆర్సీపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో సీఎస్ సమీర్ శర్మ 14.29 ఫిట్మెంట్తో పీఆర్సీ నివేదికను సీఎం జగన్‌కు అందజేశారు. అయితే సీఎస్ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టడంతో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌లు పలుమార్లు ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై…
ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే 20 రాష్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ ప్రజలపై విరుచుకుపడుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 135 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఆయా ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 600 దాటింది. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 12 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 56కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 63 ఒమిక్రాన్…
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దాని ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే ఖండతరాలు దాటి పలు దేశాల్లో విజృంభిస్తోంది. యూకే, యూఎస్‌లో ఒమిక్రాన్ ప్రభావం అధికంగా ఉంది. అయితే భారత్‌లో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గోవాలో 8 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్‌గా సోకింది. ఈ నెల 17న బాలుడు యూకే నుంచి వచ్చాడు. అయితే యూకే ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహించిన కరోనా టెస్టుల్లో కరోనా నెగిటివ్‌గా తేలింది. దీంతో ఇండియాకు…