కరోనా రక్కసి కొత్తకొత్త రూపాలతో ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. ఈ వేరియంట్ భారత్‌లో కూడా దాని ప్రభావాన్ని చూపుతోంది. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు, ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఒమిక్రాన్ కేసు సంఖ్య 600లకు చేరింది. దేశంలో ఒమిక్రాన్ 19 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాప్తిచెందుతోంది. ఈ…
ఏపీ టికెట్ల ధరల తగ్గింపు విషయం చినికిచినికి గాలివానలా తయారైంది. ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు, సినిమా థియేటర్లు మూసివేత పరిణామాలతో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం జీవో 35 ప్రవేశపెట్టి సినిమా టికెట్ల ధరలు అన్ని సినిమాలకు ఒకే విధంగా ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీంతో పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టి జీవో 35ను రద్దు…
ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్ (నూమాయిష్) ఈ సారి ఏర్పాటు చేస్తారో లేదోనని ఉత్కంఠ నెలకొంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నెలన్నర రోజుల పాటు అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన కనువిందుగా సాగుతుంది. హైదరాబాద్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ ముత్యాల నుండి మైసూర్ శాలువాల వరకూ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అయితే ఈ సంవత్సరం కరోనా కొత్త వేరియంట్…
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. నిరుద్యోగ దీక్ష అంటూ బీజేపీ చీప్ బండి సంజయ్ దీక్ష చేపడుతుంటే.. రచ్చబండ అంటూ కాంగ్రెస్ ఓ కార్యక్రమం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో మాజీ పీసీసీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. దేశానికి రాజీవ్‌గాంధీ సేవలు మరవలేనివని, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ పాలనలో బందీ అయ్యిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు కేసీఆర్‌ను తుక్కుతుక్కు ఓడిస్తారని ఆయన…
తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ రోజుల హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు నిరుద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ దీక్షలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో నాదర్శ్ షా ప్రభుత్వం నడుస్తుందని, ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని కేసీఆర్ అన్నాడు.. వచ్చాయా అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రి…
టీపీసీస రేవంత్ రెడ్డిపై ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. బీజేపీకి అమ్ముడుపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, నాడు టీడీపీని కాంగ్రెస్ కు అమ్మి… నేడు కాంగ్రెస్ ను బీజేపీకి అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా కేసీఆర్ రైతు బిడ్డ.. రేవంత్ రెడ్డి కమర్షియల్ బిడ్డ. ఏది ఎక్కడ ఎంతకు అమ్ముకోవాలనే చూస్తారని, ఎర్రవెల్లి గ్రామానికి వస్తే తరిమికొడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారని ఆయన అన్నారు. రేవంత్…
ఏపీ ప్రభుత్వం ఇటీవల వన్ టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్) పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటీఎస్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. అయితే తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఓటీఆఎస్‌ను రద్దు చేయాలంటూ కలేక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారిని జగన్ దోపిడీ చేస్తున్నాడని ఆయన అన్నారు.…
వరి కోసం తెలంగాణలో అధికార పార్టీకి విపక్షాలకు మధ్య వార్ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడంతో యాసంగిలో వరి ధాన్యం వేయకూడదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే విపక్షాలు మాత్రం వరి వేయండి అంటూ రైతులకు సందేశాలు ఇస్తున్నాయి. అయితే దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ క్రింద ఇచ్చిన లింక్‌లో వీక్షించండి.
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజుల రేవంత్ రెడ్డి ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రచ్చబండ కార్యక్రమం ఎర్రవెల్లిలో నిర్వహిస్తున్నారని ఆయన బైకాట్ చేశారు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు…
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను పట్టిపీడిస్తున్న కరోనా మహ్మారి బెడద ఇంకా తగ్గడం లేదు. తాజాగా దేశవ్యాప్తంగా కొత్తగా 6,531 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా దేశంలో కరోనా నుండి గడిచిన 24 గంటల్లో మరో 7,141 మంది కోలుకొని ఆసుప్రతి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 75,841 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోని పలు…