కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలతో పాటు ఇండియాను సైతం వదలనంటోంది. కరోనా దాటికి ఇప్పటికే ప్రపంచ దేశాలు అతాలకుతలమవుతున్నాయి. ఇప్పడిప్పుడే డెల్టా వేరియంట్ భారత్‌లో తగ్గుముఖం పడుతుందనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో మరోసారి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో రోజురోజు మరోసారి కోవిడ్ విజృంభన పెరుగుతోంది. గత వారం వరకు 7వేల లోపు నమోదైన కరోనా కేసులు ఇప్పటి రెట్టింపుగా నమోదవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా 13,154 కొత్త కరోనా కేసులు…
అనంతరపురం జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. గుంతకల్లు-బళ్లారి రహదారిపై అనంతపురం జిల్లాలోని విడపనకల్లు మండలం డోనేకల్ వద్ద బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. అయితే కనీసం ప్రమాద హెచ్చరికలు లేకపోవడంతో నిన్న రాత్రి బ్రిడ్జిపై నుంచి నుంచి కిందకు ఓ కారు పడిపోయింది. వంతెనపై నుంచి సుమారు 30 అడుగుల కిందకు కారు పడిపోయింది. దీంతో వంతెన కింద్రి ఉన్న నీటిలో కారు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి జలసమాధి అయ్యాడు.…
ఎస్బీఐ బ్యాంకులోకి చొరబడి ఇద్దరు దుండగులు బీభత్సం సృష్టించారు. ముసుగులు ధరించి బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు బ్యాంకులోవారిని బెదిరించడానికి ఒక ఉద్యోగిపై కాల్పులు కూడా జరిపారు. దీంతో సదరు ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాకుండా మిగితా బ్యాంకు ఉద్యోగులను బెదిరించి 2.5 లక్షల నగదును కూడా దోచుకెళ్లిన ఘటన ముంబాయిలోని దహిసర్ వెస్ట్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ…
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో మరోసారి దొంగలు రెచ్చిపోతున్నారు. నిజమాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. దర్పల్లి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో 10 మంది దొంగలు చొరబడ్డారు. పెట్రోల్ బంక్‌లోని కార్యాలయంపై రాళ్లతో దాడి చేస్తూ సిబ్బందిని భయాందోళనకు గురి చేశారు. సిబ్బందిని బెదిరించి పెట్రోల్ బంక్‌లోని క్యాష్‌కౌంటర్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే క్యాష్ కౌంటర్‌లో సుమారు 40 వేలు ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. దీంతో వెంటనే పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు…
గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి అగ్రరాజ్యమైన అమెరికాతో తో పాటు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్‌తో సతమతవుతున్న వేళ ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఫ్రాన్స్‌లో కలవరం పుట్టిస్తుంది. యూకే, యూఎస్ దేశాల్లో ఒమిక్రాన్ విజృంభన విపరీతంగా ఉంది. అంతేకాకుండా ఒమిక్రాన్ మరణాలు కూడా ఆ దేశాల్లో చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. ఫ్రాన్స్‌లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ వీరంగం సృష్టిస్తోంది. రోజురోజుకు ఫ్రాన్స్…
ఇటీవల వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో విజృంభిస్తోంది. రోజురోజుకు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా యూకే, యూఎస్ దేశాలలో ఇప్పటికే ఒమిక్రాన్ బారినపడిన కొందరు మృత్యువాత పడుతున్నారు. అయితే ప్రతి సంవత్సరం న్యూఇయర్ వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా యువతి న్యూఇయర్ వేడుకల్లో చేసి సంబరాలు అంతా ఇంతా కాదు. కొందరు ఉన్న ఊర్లోనే సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే, మరి కొందరు పబ్‌లు, రిసార్ట్‌ల్లో జరుపుకుంటున్నారు.…
11వ పీఆర్సీపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కానుంది. ఇప్పటికే పలు మార్లు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. సీఎస్ సమీర్ శర్మకూడా ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలో పీఆర్సీపై ముచ్చటించారు. అయినప్పటికీ పీఆర్సీపై స్పష్టత నెలకొనలేదు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్‌తో భేటీ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కూడా…
కేంద్ర జల్‌శక్తి శాఖ ఈ రోజు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సీఎస్‌లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి బోర్డులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది. సీడ్ మనీ రూ.200 కోట్లను విడతల వారీగా ఇస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు నెలలకొసారి చెల్లింపులు చేస్తామని ఏపీ ప్రతిపాదించింది. అంతేకాకుండా కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ తక్షణమే అమలు చేయాలని…
నేడు కృష్ణా జిల్లాలో జగనన్న పాలవెల్లువ పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణతో ప్రభుత్వం మార్కెట్లోకి ప్రవేశించి రైతులకు మంచి ధరలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. దీనివల్ల వ్యాపారులు కూడా మంచి ధరలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని, నిర్ణయించిన ధరకు లేక అంతకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ధరల స్థిరీకరణ నిధిద్వారా రైతులకు తోడుగా నిలవగలిగామని ఆయన వెల్లడించారు.…
ఏపీ సీఎం జగన్ ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కృష్ణా జిల్లాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో ఏపీ పాలవెల్లువ ద్వారా పాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. కొనేవారు ఒక్కడే, అమ్మేవాళ్లు అనేక మంది ఉంటే.. కొనేవాళ్లు ఎంత చెప్తే.. అంతకు అమ్మాల్సిన పరిస్థితి ఉంటుందని, ఇలాంటి మార్కెట్‌ను ఇవాళ మన రాష్ట్రంలో కూడా చూస్తున్నామన్నారు. అందుకే…