సాధారణంగా గుండె వ్యాధులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం వుంటుందని భావిస్తారు. కానీ ప్రైవేట్ ఆసుపత్రులను మించి అత్యాధునికమైన గుండెకు సంబంధించిన వైద్యాన్ని అందిస్తున్నారు విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. గుండె వ్యాధిగ్రస్తులకు పూర్తి భరోసా ఇస్తున్నారు. గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చిందంటే వెంటనే గుర్తుకు వచ్చేది ప్రైవేట్ ఆసుపత్రి. కానీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ప్రైవేటు ఆసుపత్రిలో అందించే వైద్యం ఇక్కడ అందించటం విశేషం. అంతే కాకుండా ఇక్కడ విజయవంతంగా అరుదైన గుండె…