ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఈ అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పునీత్ లేరనే విషయాన్ని కన్నడ చిత్ర పరిశ్రమనే కాదు పునీత్ అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఈ ఏడాది ఆరంభంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గంధద గుడి’ ఆరంభించాడు. సాహసోపేతమైన డాక్యుమెంటరీగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను పునీత్ తల్లి పార్వతమ్మరాజ్‌కుమార్ జన్మదిన సందర్భంగా సోమవారం ఆవిష్కరించారు. పునీత్ భార్య, చిత్ర…