భూ కుంభకోణం కేసులో బంగ్లాదేశ్‌లోని ఓ కోర్టు పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆమె సోదరి షేక్ రెహానాకు ఏడేళ్ల జైలు శిక్ష, ఆమె మేనకోడలు బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసును ది డైలీ స్టార్ నివేదించింది. ఢాకాలోని స్పెషల్ జడ్జ్ కోర్టు-4 న్యాయమూర్తి ఎండీ రబియుల్ ఆలం ఈ తీర్పును వెలువరించారు. అవినీతి నిరోధక కమిషన్ (ACC) దాఖలు…
Muda Scam: కర్ణాటకలో ముడా కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇతరులకు చెందిన 300 కోట్ల రూపాయల విలువైన 140 స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది.
Hemant Soren: ల్యాండ్ స్కామ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌కి బెయిల్ లభించింది. ల్యాండ్ స్కామ్ కేసులో మనీలాండరింగ్‌కి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఈడీ సోరెన్‌ని అరెస్ట్ చేసింది.
భూ కుంభకోణం కేసులో నిందితుడైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ పిటిషన్‌పై జార్ఖండ్ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఈడీ తన సమాధానం దాఖలు చేయడానికి సమయం కోరింది.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు నిరాకరించింది.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దాదాపు 18 గంటలుగా కనిపించకుండా పోయారు. ఆయన కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం వేచి చూస్తుంది. అయితే, నిన్న ఢిల్లీలోని హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి చేరుకున్న ఈడీ ఓ బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకుంది.
పత్రాచాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (PMLA) కోర్టు సోమవారం 14 రోజులు పొడిగించింది.