ఏపీలో ఇవాళ్టి నుంచి పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి రానున్నాయి. జనవరి 31వరకే ప్రస్తుత ధరలు ఉండగా.. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కనీసం 20 శాతం పెరుగనున్నాయి. దీంతో తక్కువ ధరలతో జరిగిన క్రయవిక్రయాలను రిజిస్టర్ చేసుకోవడానికి నిన్నటి వరకు క్లయింట్లు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూ కట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచేందుకు సిద్ధమైంది.. సవరించిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అంటే రేపటి నుంచే అమల్లోకి రాబోతున్నాయి.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల విలువల సవరణ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించింది సర్కార్.. అయితే, రేపటి నుంచే కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి..
భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచడంపై కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వం.. వచ్చే నెల (ఫిబ్రవరి) 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందట.. అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనలతో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందట.. అయితే, అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే విషయంలో మినహాయింపు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందట..