Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్, ఆయన తనయులు తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. కొద్దిసేపటి క్రితం బెయిలు మంజూరు చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు. ఉద్యోగాల కోసం భూమి కేసులో ఈ ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి ఆమోదించారు. ఉద్యోగాల కోసం భూమి కేసులో ఆయనను విచారించేందుకు సీబీఐ అనుమతిని ఢిల్లీ కోర్టుకు సమర్పించింది.
Lalu Yadav: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు ప్రస్తుత బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ‘ల్యాండ్ ఫర్ జాబ్’ స్కామ్‌లో లాలూ కుటుంబం నిందితులుగా ఉంది. తేజస్వీ యాదవ్‌కి శుక్రవారం ఈడీ సమన్లు అందగా.. డిసెంబర్ 27న ఏజెన్సీ ముందు హాజరు కావాలని లాలూని ఈడీ కోరింది
Land-For-Jobs Case: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, వీరి కుమారుడు, ప్రస్తుత బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ లకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ వారిపై దాఖలైన ఛార్జిషీట్ ని పరిగణలోకి తీసుకున్నారు. అవినీతి, నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతో సహా పలు నేరాలను ప్రాథమిక సాక్ష్యాలు చూపించాయని అన్నారు.
ఆర్జేడీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. భూ కుంభకోణం కేసుకు సంబంధించి దేశ రాజధానిలోని తేజస్వీ యాదవ్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం దాడులు నిర్వహించింది.