Land for jobs scam: బీహార్ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య మాజీ సీఎం రబ్రీ దేవికి ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. లాలూతో పాటు ఆయన కుమార్తె హేమా యాదవ్‌ని ఫిబ్రవరి 9న తమ ముందు హాజరుకావాలని శనివారం ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్’లో వీరందరికి సమస్లు వచ్చాయి.
Supreme Court: రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో రెండు ఏళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత రాజకీయం మారుతోంది. తాజాగా శుక్రవారం 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ అత్యున్నత న్యాయస్థానం తలుపుతట్టారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో వరసగా ఈడీ సోదాలను నిర్వహించింది. తన కుమార్తె, మనవరాలు, కోడలును వేధిస్తున్నారంటూ లాలూ బీజేపీపై మండిపడ్డారు.
బిహార్‌లో ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడుల తర్వాత ఆ రాష్ట ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. కేంద్రంలోని అధికార పక్షం తమకు ఆధిక్యత లేని రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలపై కేంద్ర ఏజెన్సీలను పంపుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీకి ముగ్గురు అల్లుళ్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
బిహార్‌లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం బలపరీక్ష రోజే ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. బిహార్‌లో ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్, ముగ్గురు ఎంపీలు అష్ఫాక్ కరీం, ఫయాజ్ అహ్మద్, సుబోధ్ రాయ్‌లకు సంబంధించిన ఆస్తులపై దాడులు నిర్వహించారు.