తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించిన భూముల వేలం రికార్డుల సృష్టికర్తగా నిలిచింది. రాయదుర్గం ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీ భూభాగాలపై నిర్వహించిన ఈ వేలం ఊహించని స్పందనకు దారితీసింది. ఒక ఎకరం భూమి ధర ₹177 కోట్ల వరకు చేరడం మార్కెట్ లో శ్రేష్ఠ రికార్డ్ స్థాపించిందని తెలుస్తోంది.
తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) ఈ నెల 6 నుండి 20 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 100 ప్లాట్ల వేలాన్ని నిర్వహించనుంది. గత నెలలో ఈ వేలానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
HMDA: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విలువైన భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) తాజాగా ఈ-వేలం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజాల్ లేఅవుట్‌లో మొత్తం 12 ప్లాట్లు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని బాచుపల్లి లేఅవుట్‌లో 70 ప్లాట్లు, అలాగే రంగారెడ్డి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 4 ప్లాట్లు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో మరో 7 ప్లాట్లు వేలం ద్వారా అమ్మకానికి ఉంచనున్నట్లు హెచ్ఎండీఏ…
Raghunandan Rao : ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ధర్నా నిర్వహించారు. HCU భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. HCU భూముల వేలాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ఎకరా భూమి 80 – 100 కోట్ల రూపాయలు ఉందన్నారు బీజేపీ ఎంపీలు. విద్యార్దులు ఉద్యమాలు చేస్తుంటే పోలీసులను ఉసి గోల్పి జైళ్ళ పాలు చేస్తుందని, విశ్వ విద్యాలయ భూమిని నాశనం చేస్తూ పర్యావరణానికి నష్టం కలగజేస్తున్నారని బీజేపీ ఎంపీలు వ్యాఖ్యానించారు. ఎంపీ…
జన సమితి కోదండ రామ్ రెడ్డికి కళ్లు కనిపించడం లేదా? అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వేలంపై ఆయన మాట్లాడారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని... ఈ భూములను కాపాడుతామన్నారు. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులని గుర్తు చేశారు. ఈ భూములను రాబర్ట్ వాద్రా కోసమే అమ్ముతున్నావా? అని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ భర్త కోసమే భూముల అమ్ముతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ దొంగ…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలని యత్నిస్తున్న 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలో ఉందని, అటువంటి భూమిని కేంద్ర అనుమతి లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని అన్నారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూవివాదంపై హైకోర్టులో కేసు నడుస్తోందని బండి సంజయ్ గుర్తు చేశారు. వట ఫౌండేషన్ అనే ఎన్జీవో దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఏప్రిల్ 7…
గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది. 2001లో చంద్రబాబు హయాంలో గచ్చిబౌలి స్టేడియం నిర్మాణం కోసం హెచ్‌సీయూకి చెందిన 2300 ఎకరాల నుంచి 40 ఎకరాలు తీసుకున్నారు. అలాగే, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎంజీ భారత్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హెచ్‌సీయూ భూమిలో నుంచి మరో 400 ఎకరాలు కేటాయించారు. ఈ 400 ఎకరాల కేటాయింపును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నిరసనల నేపథ్యంలో గోపన్‌పల్లి పరిధిలో ప్రత్యామ్నాయంగా 400 ఎకరాలు కేటాయించారు.…
ఆర్థిక వనరుల సమీకరణ పేరిట రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25(పి) లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ అంశపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే ఆపాలని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లి మండలం పరిధిలోని మోకిల గ్రామంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో 300 గజాల చొప్పున 1,321 ఫ్లాట్లతో మోకిలలో రెసిడెన్షియల్ లేఅవుట్ ను రూపొందించింది. అయితే, హెచ్ఎండీఏ లేఅవుట్ లో ప్లాట్ల కొనుగోలుకు రెండవ రోజు (గురువారం) అదే జోరు కొనసాగింది.
హైదరాబాద్ నగర శివారులో మరో భారీ భూ వేలం పాటకు తెలంగాణ సర్కార్ సిద్ధం అయింది. మొకిలా ఫేజ్- 2 భూ వేలానికి హెచ్‌ఎండీఏ నేడ (సోమవారం) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని మొకిలా దగ్గర మూడు వందల పాట్ల అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.