Abortion: ఇంట్లోనే మాత్రలను వినియోగించి అబార్షన్ నిర్వహించడం సురక్షితమని, ఆస్పత్రి భారాన్ని తగ్గించవచ్చని లాన్సెట్ జర్నల్‌లో శుక్రవారం ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంది. స్వీడన్‌కి చెందిన పరిశోధకులు 435 మంది మహిళలపై ట్రయల్స్ నిర్వహించాయి. ఇంట్లో లేదా ఆస్పత్రిలో మిసోప్రోస్టోల్ (వైద్య గర్భస్రావ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన మాత్ర)లు తీసుకున్న మహిళల్ని వీరు విశ్లేషించారు.
India fertility rate: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంతానోత్పత్తి రేటు(ఫర్టిలిటీ రేట్) పడిపోతోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు తక్కువ సంతానోత్పత్తి రేటును ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలో కూడా సంతానోత్పత్తి రేటు 1950లో దాదాపుగా 6.2 శాతంగా ఉంటే 2021 నాటికి 2కి పడిపోయినట్లు ది లాన్సెట్ అధ్యయనం తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఉన్న రోగాలతోనే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొత్త కొత్త బ్యాక్టీరియ, వైరస్‌లతో కొత్త రోగాలు వస్తున్నాయి.
5 Bacteria Types Claimed 6.8 Lakh Lives In India In 2019: ప్రపంచవ్యాప్తంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల 2019లో 77 లక్షల మంది చనిపోయారని లాన్సెట్ అధ్యయనంలో వెల్లడైంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మరణాలకు రెండో అతిపెద్ద కారణం అవుతున్నాయని స్టడీలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మరణాల్లో ఒకటి బ్యాక్టీరియాతో ముడిపడి ఉందని కనుగొంది. ప్రపంచవ్యాప్తంగా 2019లో 77 లక్షల మరణాలు సంభవిస్తే ఇందులో సగం మరణాలకు 33 రకాల బ్యాక్టీరియాలు కారణం అయ్యాయి. ఇందులో…
Indians Use Antibiotics Excessively, Azithromycin On Top: దేశంలో ప్రజలు యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడుతున్నట్లు లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ కు ముందు, కోవిడ్ సమయంలో అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లను విస్తృతంగా వాడినట్లు స్టడీలో వెల్లడించింది. ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల శరీరం, బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ కు లొంగకుండా తయారవుతుందని లాన్సెట్ వెల్లడించింది.
మందు తాగటం మంచి అలవాటు కాదంటారు. కానీ 40 ఏళ్ల వయసు దాటినవారు స్వల్పంగా ఆల్కహాల్ తీసుకోవటం ఆరోగ్యానికి లాభిస్తుందని లాన్సెట్ స్టడీ తెలిపింది. రెడ్ వైన్‌ని రెండు, మూడు పెగ్గులేస్తే గుండె జబ్బులు, గుండెపోటు, షుగర్ లెవల్స్ వంటి హెల్త్ రిస్కులు తగ్గుతాయని పేర్కొంది. 39 ఏళ్ల లోపువారు మందుకొడితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనమూ ఉండదని, పైగా అనారోగ్యానికి గురవుతారని హెచ్చరించింది. మన దేశంలో గత 30 ఏళ్లలో ఆల్కహాల్ వినియోగం కొంచెం పెరిగినట్లు వెల్లడించింది.…