India fertility rate: ఇండియాలో సంతానోత్పత్తి రేటు 6.2 నుంచి 2కి తగ్గింది.. లాన్సెట్ నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India fertility rate: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంతానోత్పత్తి రేటు(ఫర్టిలిటీ రేట్) పడిపోతోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు తక్కువ సంతానోత్పత్తి రేటును ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలో కూడా సంతానోత్పత్తి రేటు 1950లో దాదాపుగా 6.2 శాతంగా ఉంటే 2021 నాటికి 2కి పడిపోయినట్లు ది లాన్సెట్ అధ్యయనం తెలిపింది.
టోటల్ ఫెర్టిలిటీ రేట్(TFR) 1950లో ఒక మహిళకు 4.8 కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉంది. 2021లో ఒక్కో మహిళ 2.2 పిల్లలను మాత్రమే కలిగి ఉంది. ఈ గణాంకాలు 2050, 2100 నాటికి 1.8, 1.6 శాతానికి తగ్గుతాయని అంచనా వేయబడింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా 12.9 కోట్ల పిల్లలు జన్మించారు, 1950లో దాదాపుగా 9.3 కోట్ల నుంచి 2016లో 14.2 కోట్ల పిల్లల జననాలకు తగ్గింది. భారతదేశంలో 1950లో 1.6 కోట్ల కంటే ఎక్కువ సజీవ జననాలు జరిగాయి, 2021లో ఇది 2.2 కోట్ల పిల్లల జననాలు జరిగాయి. 2050 నాటికి ఇది 1.3 కోట్లకు చేరే అవకాశం ఉంది.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
ప్రస్తుతం చాలా దేశాలు సంతానోత్పత్తి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అయితే, తక్కువ-ఆదాయ దేశాల్లో మాత్రం ఇప్పటికీ సంతానోత్పత్తి రేటు అధికంగానే ఉంది. ఈ దేశాలు 21 శతాబ్ధంలో కూడా అధిక ఫెర్టిలిటీ సమస్యలను ఎదుర్కొంటోందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా పశ్చిమ, తూర్పు సబ్ సహారా ఆఫ్రికాలోని కొన్ని దేశాలు ఇది ఎక్కువగా ఉంది. 2021 నుంచి 2100 వరకు ప్రపంచ సజీవ జననాల్లో తక్కువ ఆదాయ దేశాల వాటా 18 శాతం నుంచి 35 శాతానికి రెట్టింపు అవుతుందని, కొన్ని పేద దేశాల్లో ఎక్కువ మంది పిల్లలు పుడుతారని పరిశోధకులు అంచానా వేశారు.
Read Also: Supreme Court: తమిళనాడు గవర్నర్ కోర్టును ధిక్కరిస్తున్నాడు.. కేంద్రం ఏం చేస్తుందని సుప్రీం ఫైర్..
మారుతున్న వాతావరణ మార్పులు, అధిక సంతానోత్పత్తి తక్కువ ఆదాయ దేశాలు తరుచుగా వరదలు, కరువులు కారణంగా ఆహారం నీరు కొరత ఎదుర్కొంటుందని హీట్ రిలేటెడ్ వ్యాధులు, మరణాలు పెరుగుతాయని నివేదిక చెప్పింది. సంతానోత్పత్తి అనేది ఆర్థిక వ్యవస్థలు, భౌగోళిక రాజకీయాలు, ఆహార భద్రత, ఆరోగ్యం, పర్యావరణం ఇలా పలు అంశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పింది. ముఖ్యంగా మధ్య- ఉన్నత ఆదాయ దేశాలకు, తక్కువ ఆదాయ దేశాల మధ్య స్పష్టమైన జనాభా విభజనను చూపిస్తుందని నివేదిక పేర్కొంది. వృద్ధాప్య జనాభా సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వాలు నిధులను, ఇతర మార్గాలను గుర్తింకపోతే, ఇది జాతీయ ఆరోగ్య బీమా, సామాజిక భద్రత కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలపై ఎక్కువ ఒత్తిడి తెస్తుందని నివేదిక హెచ్చరించింది.
ప్రపంచ జనాభా నిరంతర క్షీణత వనరులు, కర్బణ ఉద్గారాలపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు పర్యావరణ పురోగతికి అవకాశాలు అందించవచ్చు. ఇక తక్కువ ఆదాయదేశాల్లో సంతానోత్పత్తిని తగ్గించడానికి గర్భనిరోధక వెసులుబాటు, విద్య వంటివి సహాయపడుతాయని పరిశోధకులు అంచనా వేశారు. పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PFI) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రెజా మాట్లాడుతూ.. ఈ పరిశోధన ఇండియాకు తీవ్ర చిక్కులను కలిగి ఉందని, వృద్ధాప్య జనాభా, శ్రామిక శక్తి కొరత వంటి సవాళ్లను ప్రేరేపించవచ్చని హెచ్చరించారు. ఈ సవాళ్లకు భారత్ ఇప్పడు కొన్ని దశాబ్ధాల దూరంగా ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే సమగ్రమైన విధానంతో మనం పనిచేయాలని సూచించారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!