Yadadri Temple: కార్తీక మాసం నేపథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ ఎప్పటిలాగే భారీ స్థాయిలో నమోదైంది. ఈ మాసంలో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 20 లక్షల 52 వేల దాటింది. భక్తుల సంఖ్య పెరగడంతో దేవాలయ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఈ కార్తీక మాసంలో యాదాద్రికి వచ్చిన మొత్తం ఆదాయం రూ.17 కోట్లు 62 లక్షలు 33 వేల 331. గతేడాది ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ. 14…
Yadagirigutta: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు పంచకుండాత్మక మహా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం వారు అంతరాలయం మాడ వీధుల్లోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
Yadagirigutta: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ మహోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి ఉదయం 11:00 గంటలకు హెలిప్యాడ్ ద్వారా యాదగిరిగుట్టకు రానున్నారు. అనంతరం 11:25 నుండి 12:15 వరకు జరిగే కుంభాభిషేకంలో పాల్గొననున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు కొంతకాలం భక్తుల ప్రవేశాన్ని పరిమితం చేశారు. ఉదయం 9…
యాదాద్రి నరసింహ స్వామి దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త.. గతంలో నిర్ణయించిన ప్రకారమే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి బాలాలయంలో కాకుండా ప్రధాన ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి ఇస్తారు.. యాదాద్రి స్వామివారి స్వయంభువుల దర్శనాలు ఈ నెల 28న ఉదయం 11.55 గంటలకు నిర్వహించనున్న మహాకుంభ సంప్రోక్షణతో ప్రారంభం అవుతాయని తెలిపారు ఆలయ ఈవో గీతారెడ్డి.. ఈ నెల 21 నుంచి వారం రోజుల పాటు బాలాలయంలో…