గుడిని, గుడిలో లింగాన్ని కూడా కాజేసే కేటుగాళ్లు తయారయ్యారు. తాజాగా గుంటూరు మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిధుల గోల్ మాల్ కలకలం రేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షల రూపాయల స్వామివారి సొమ్మును నొక్కేశారు. 2019 నుండి 2022 వరకు 23.77 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించారు అధికారులు.
Read Also:Taneti Vanitha: విపత్తులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాం
ఆలయంలో గుమస్తాగా పనిచేసిన శ్రీనివాస్ తో పాటు మరికొందరు ఈ గోల్ మాల్ వ్యవహారంలో పాత్రదారులుగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు. గత కొద్ది రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడు గుమస్తా శ్రీనివాస్. దీంతో అతనే ఈ స్కాంకి సూత్రదారిగా అనుమానిస్తున్నారు. ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై దేవాదాయ శాఖ కమిషనర్ కు నివేదిక పంపించారు అధికారులు. ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు భక్తులు.. స్వామివారి ఆదాయానికి గండి కొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Read Also: Menstrual Blood : రక్తం ఖరీదు రూ.50వేలు.. కోడలిది తీసి మంత్రగాడికి అమ్మిన అత్త