మిస్ యూనివర్స్ విక్టోరియా క్జేర్ థీల్విగ్ తెలంగాణ పర్యటనలో ఉంది. మిస్ వరల్డ్ 2025 ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు చేరుకుంది. ఆమె ఈ రోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంది. క్జేర్ థీల్విగ్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం కల్పించారు. హిందు సాంప్రదాయ దుస్తులు ధరించిన క్జేర్ థీల్విగ్ స్వామికి ప్రత్యేక పూజలు, అఖండ దీపారాధన చేసింది. అనంతరం పూజారుల ఆశీర్వచనం తీసుకుంది. ఆలయ విశిష్టతను అధికారులు వివరించారు. ఆలయ…
KCR : నాటి కేసీఆర్ ప్రభుత్వం పునర్నిర్మాణం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన స్వర్ణ విమాన గోపురానికి.. ఈనెల 23 న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, యాదగిరి గుట్ట పునర్నిర్మాణ కర్త, బి ఆర్ ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుని ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. అనంతరం…మార్చి నెల 1 నుంచి 11 వ తారీఖు…
Yadagirigutta: యాదగిరిగుట్టపై దాదాపు 200 వరకు గదులను భక్తుల బసకు ఏర్పాట్లు చేపట్టారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు వసతి పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో..
Yadagirigutta: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు ఆలయ నిర్వహాకులు శుభవార్త తెలిపారు. సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ కొండపైనున్న విష్ణు పుష్కరిణిలో భక్తులకు సంకల్ప స్నానం ఆచరించే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Yadagirigutta: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 11 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 21 వరకు వైభవంగా జరగనున్నాయి.
గోదావరి నీళ్లతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి పాదాలు కడగాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ నుంచి యాదాద్రికి అధికారులు నీరు విడుదల చేశారు. ఈ మేరకు ఆఫ్టేక్-2 నుంచి గోదావరి జలాలు యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లికి చేరుకున్నాయి. అటు నుంచి ఈ గోదావరి జలాలు యాదాద్రి నారసింహుడి చెంతకు చేరాయి. యాదాద్రి ఆలయంలో పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభమైన రోజే గండి చెరువును అధికారులు కాళేశ్వరం నీటితో నింపారు.…
శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. బాలాలయం వద్ద భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోవడంతో భక్తులకు సాధారణ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. తెల్లవారుజామున 4 గంటలకు బాలాలయంలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారికి ఆర్జిత సేవలు నిర్వహించారు. బాలాలయంలో ఆలయ అర్చకులు నిజాభిషేకం, సుదర్శన మహా హోమం నిర్వహించారు. గుట్టపైన ఉన్న పాత గోశాలలోని వ్రత మండపంలో జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి…
సిద్ధిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావుకమిటీల నిర్వహణ, బహిరంగ సభ పై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తన పిలుపుతో స్వచ్ఛం దంగా యాదాద్రి ఆలయ గోపురానికి బంగారాన్ని ప్రకటించిన కౌన్సి లర్స్, టీఆర్‌ఎస్ కార్యకర్తలను అభినందించారు. యాదాద్రి ఆలయ బంగారు గోపుర నిర్మాణానికి సిద్ధిపేట నుంచి కిలో బంగారం ఇస్తామని అక్కడి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రకటించారన్నారు. లక్ష్మీ నర సింహ స్వామికి 37 తులాల బంగారం సిద్ధిపేట…
ధర్మకర్తగా ఆయనది అధికారం. వ్యవస్థను గాడిలో పెట్టే దిశలో ప్రభుత్వానిది అజమాయిషీ. ఈ రెండింటి మధ్య ఇప్పుడు సంఘర్షణ జరుగుతోంది. అధికారులు అడకత్తెరలో పడ్డారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకి కోపం అన్నట్టు నలిగిపోతున్నారు. ఇంతకీ ఆ వివాదం ఎక్కడిది? ఈ స్టోరీలో చూద్దాం. గత ఏడాది అనువంశిక ధర్మకర్త బాధ్యతల నుంచి అశోక్ తొలగింపు సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ్మస్వామి దేవస్థానం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయ వ్యవహారాలకంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు…