సిద్ధిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావుకమిటీల నిర్వహణ, బహిరంగ సభ పై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తన పిలుపుతో స్వచ్ఛం దంగా యాదాద్రి ఆలయ గోపురానికి బంగారాన్ని ప్రకటించిన కౌన్సి లర్స్, టీఆర్‌ఎస్ కార్యకర్తలను అభినందించారు. యాదాద్రి ఆలయ బంగారు గోపుర నిర్మాణానికి సిద్ధిపేట నుంచి కిలో బంగారం ఇస్తామని అక్కడి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రకటించారన్నారు. లక్ష్మీ నర సింహ స్వామికి 37 తులాల బంగారం సిద్ధిపేట నుంచే వస్తుందని ఈ సందర్భంగా హరీష్ రావు అన్నారు. ఐదుగురి సభ్యులతో యదాద్రి కి బంగారం సేకరిస్తామన్నారు. సామాజిక, ధార్మిక ఆథ్యాత్మిక సేవాభావానికి సిద్ధిపేట మారుపేరన్నారు.
గులాబీ జెండా ద్విదశాబ్ది ఉత్సవం.. దీక్షా దివస్ రోజున వరంగల్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలు నేరవేర్చిన గడ్డకు దిక్సూచి సిద్ధిపేట అని మంత్రి పేర్కొన్నారు. జల దృశ్యం నుండి.. సుజల దృశ్యం వరకు.. కరువు కన్నీళ్ల నుంచి కాళే శ్వరం నీళ్ల వరకు అన్ని టీఆర్‌ఎస్ సాధించిన విజయాలు అన్నారు. నాయకుడు మాట చెబితే కార్యకర్తలుగా పనిచేస్తాం.. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే నాయకుని కుటుంబ సభ్యులని హరీష్ రావు అన్నా రు. కరోనా కష్ట కాలంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడంతో పాటు కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామని ఆయన అన్నారు. 29న సభకు పెద్దఎత్తున తరలి వెళ్దాం అని కమిటీల నిర్మాణం పటిష్టంగా చేద్దామని, కమిటీల్లో యువత, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి మంత్రి హరీష్‌రావు ఆత్మీయంగా అన్నం వడ్డించారు.