India-China: సరిహద్దు వివాదానికి శాశ్వత పరిష్కారంపై చర్చించేందుకు భారత్, చైనాల మధ్య ప్రత్యేక ప్రతినిధులు సమావేశం ఈ రోజు (డిసెంబర్ 18) బీజింగ్ జరగనుంది.. ఈ భేటీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొననున్నారు.
LAC Border truce: 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్-చైనా సరిహద్దుల వెంబడి ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇటీవల ‘‘లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ)’’ వెంబడి దీర్ఘకాలంగా ఉన్న ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్, చైనాలు సరిహద్దు సంధిని కుదుర్చుకున్నాయి. లఢక్ ప్రాంతంలో సరిహద్దు ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యం వెనక్కి వెళ్లేందుకు అంగీకరించాయి.