China: సిక్కింకి 150 కి.మీ దూరంలో అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించిన చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: జిత్తులమారి డ్రాగన్ కంట్రీ చైనా భారత్‌ని కవ్వించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే భారత సరిహద్దులను అస్థిరపరిచే కుట్రను గత కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. అయితే, ప్రస్తుతం భారత్ కూడా తన సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. ఇదిలా ఉంటే, సిక్కిం నుంచి కేవలం 150 కి.మీ దూరంలో చైనా తన అత్యాధునిక J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లలను మోహరించినట్లు శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది. టికెట్‌లోని రెండో అతిపెద్ద పట్టణమైన షిగాట్సేలోని ఎయిర్‌పోర్టులో ఆరు J-20 ఫైటర్ జెట్లను మోహరించింది.
షిగాట్సే ఎయిర్‌పోర్టు మిలిటరీ, సివిలియన్ రెండు విధాలుగా పనిచేసేలా నిర్మించారు. ఈ విమానాశ్రయం 12,408 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విమానాశ్రయాల్లో ఒకటి. ఈ ఫైటర్ జెట్లతో పాటు J-500 ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా చిత్రాల్లో కనిపించింది. అయితే, భారత వైమానికదళం ఇప్పుడే దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
J-20 స్టీల్త్ ఫైటర్ ఇప్పటి వరకు చైనా యొక్క అత్యంత అధునాతనమైన ఆపరేషనల్ ఫైటర్ జెట్. ఈ విమానాలు ప్రధానంగా చైనాలోని తూర్పు ప్రావిన్సులో ఉన్నాయని సమాచారం. అయితే, అందుకు భిన్నంగా వీటిని భారత సరిహద్దుల వద్ద మోహరించారని ప్రముఖ జియోస్పేషియల్ విశ్లేషకుడు సిమ్ టాక్ తెలిపారు. భారత్ ప్రస్తుతం 36 ఫ్రెంచ్- నిర్మిత రాఫెల్ యుద్ధవిమానాలతో J-20ని ఎదుర్కొంటుంది. వీటిలో 8 ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (USAF) తో అధునాతన వైమానిక పోరాట వ్యాయామాల కోసం అలాస్కాకు వెళ్లాయి.

Read Also: Southwest Monsoon: చాలా అరుదు.. కేరళ, ఈశాన్య ప్రాంతాలకు ఒకేసారి రుతుపవనాల రాక..
చైనా షిగాట్సే ఎయిర్ పోర్టు పశ్చిమ బెంగాల్‌లోని హసియార ఎయిర్ బేస్ నుంచి 290 కి.మీ కన్నా ఎక్కువ దూరంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో భారత్ 16 రాఫెల్స్‌తో కూడిన రెండు స్వ్కాడ్రన్లను మోహరించి ఉంచింది. టిబెట్‌లో చైనా J-20 మోహరించడం ఇదే మొదటిసారి కాదు. 2020 మరియు 2023 మధ్య చైనాలోని హోటాన్ ప్రిఫెక్చర్‌లోని జిన్‌జియాంగ్‌లో జెట్‌లు గమనించబడ్డాయి.చెంగ్డు J-20, మైటీ డ్రాగన్ అని కూడా పిలుస్తారు, ఇది 2017లో సర్వీస్‌లోకి వచ్చింది. ఇది ట్విన్ ఇంజన్ స్టెల్త్ ఫైటర్. అయితే, చైనా ఇప్పటికే 250 వరకు J-20 జెట్లను మోహరించి ఉంచవచ్చని, వీటిని ఉపగ్రహ చిత్రాలు గుర్తించకుండా ఉండొచ్చని భావిస్తున్నారు.
స్టెల్త్ ఫైటర్ జెట్లను కార్యాచరణ కోసం రంగంలోకి దింపిన మూడో దేశంగా చైనా ఉంది. దీని ప్రధాన ప్రాముఖ్యత ‘‘ఎయిన్ సుపీరియారిటీ’’. ఇది చైనా అత్యంత అధునాతన ఎయిర్-టూ-ఎయిర్ క్షిపణుల్ని కలిగి ఉంటుంది. ఇందులో మొత్తం PL-15 దీర్ఘ-శ్రేణి ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి కూడా ఉంది, వీటికి 300 కి.మీ పరిధిలోని వైమానిక లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నమ్ముతారు. గత ఐదేళ్లుగా భారత సరిహద్దు వెంబడి చైనా తన వాయుశక్తిని పెంచుతోంది. భారత్ కూడా సరిహద్దుల్లో సైనిక మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!