అభిమానులు ప్రేమగా ‘మక్కల్ సెల్వన్’ అని పిలుచుకునే తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి గతంలోనే తెలుగులో ‘సైరా’లో ఓ ప్రత్యేక పాత్రలో మెరిశాడు. ఈ యేడాది వచ్చిన ‘ఉప్పెన’లో ప్రతినాయకుడిగా నటించి, మెప్పించాడు. తాజాగా విజయ్ సేతుపతి నటించిన ‘లాభం’ తమిళ చిత్రం, తెలుగులోనూ అదే పేరుతో డబ్ అయ్యి ఒకేసారి విడుదలైంది. శ్రుతిహాసన్ కీలక పాత్ర పోషించిన ‘లాభం’ ఎలా ఉందో తెలుసుకుందాం. దేశ దిమ్మరి మాదిరి ఊర్లు పట్టి తిరిగిన బద్రి (విజయ్ సేతుపతి)…